లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం..నోటీసులిచ్చిన బీఆర్‌ఎస్‌!

దేశంలో జరుగుతున్న కొన్ని సంఘటనలపై మోడీ ప్రభుత్వం నోరు మెదపడం లేదని లోక్ సభలో విపక్షాలు మొదటి నుంచి వాదిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం మోడీ సర్కార్‌ పై బీఆర్‌ఎస్‌ తో పాటు కాంగ్రెస్‌ కూడా అవిశ్వాస తీర్మానానికి నోటిసులు ఇచ్చాయి. ప్రస్తుతం దేశాన్ని అట్టడుకిస్తున్న అంశం..మణిపూర్‌ హింస ఘటన.

New Update

congress and brs file no trust motion against government in loksabha

ఈ అంశం పై కేంద్ర విధానాలు కానీ, మోడీ సర్కార్‌ తీసుకునే నిర్ణయాలు సరైనవి కావని రెండు పార్టీలు ఆరోపించాయి. అందుకే బుధవారం బీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీని గురించి లోక్‌ సభ సెక్రటరీ జనరల్‌ కు ఎంపీ నామా ఓ లేఖ ను రాశారు.

198 (బీ) రూల్‌ ప్రకారం లోక్‌ సభలో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇస్తున్నట్లు నామా వివరించారు. కాగా లోక్‌సభ బిజినెస్‌ లో ఈ నోటీసును కూడా చేర్చాలని ఆయన సెక్రటరీ జనరల్ ను కోరారు. అయితే విపక్షాల కూటమి INDIA త‌రుపున కాంగ్రెస్ ఎంపీ గౌర‌వ్ గ‌గోయ‌ల్ కూడా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నో కాన్ఫిడెన్స్ మోష‌న్ ఫైల్ చేశారు. కాగా ఈ అంశం గురించి చర్చించేందుకు మోడీ ముఖం చాటేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం పై బీఆర్‌ఎస్‌ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేసింది.

సమావేశాలు మొదలై నాలుగు రోజులు అవుతున్నప్పటికీ ఒక్కరోజు కూడా సభ సజావుగా సాగలేదు. కేంద్ర వైఖరిని ఎండగట్టేందుకు అవిశ్వాస తీర్మానమే సరైన నిర్ణయమని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు