Amit Shah: అమిత్‌షా సమాధానం చెప్పాల్సిందే.. రేపు పార్లమెంట్‌ను కుదిపేయనున్న దాడి ఘటన! లోక్‌సభలో జరిగిన దాడిలో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనపై కేంద్రహోంమంత్రి అమిత్‌షా ఇప్పటివరకు స్పందించకపోవడంపై మండిపడుతున్నాయి. రేపటి(డిసెంబర్ 14) పార్లమెంట్ సమావేశాల్లో అమిత్‌షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. By Trinath 13 Dec 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి పార్లమెంట్‌పై దాడి ఘటన ప్రకంపనలు రేపుతోంది. ఇటు సామాన్యులు.. అటు ప్రతిపక్షాలు ఈ విషయంలో ఓకే తాటిపై ఉన్నట్లు కనిపిస్తోంది. దేశ అత్యున్నత భననంగా భావించే పార్లమెంట్ బిల్డింగ్‌లో అది కూడా లోక్‌సభ జరుగుతుండగా సెక్యూరిటీ ఉల్లంఘన జరగడంపై యావత్ దేశం పెదవి విరుస్తోంది. భద్రతా ఉల్లంఘన ఎలా జరిగిందో కేంద్రం సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంట్ భవనంపై దాడి అంటే యావత్ దేశంపై దాడి జరిగినట్లేనంటున్నారు. ఇంత నిర్లక్ష్యంగా సెక్యూరిటీ సిబ్బంది ఎందుకు ఉన్నారో తెలియడం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. లోక్‌సభ లోపల ఇద్దరు.. పార్లమెంట్(Parliament) ఆవరణలో మరో ఇద్దరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన విషయం తెలిసిందే. లోక్‌సభ(Lok Sabha) లోపల స్మోక్ స్టిక్‌లు పట్టుకోని కర్ణాటకు చెందిన మనోరంజన్, సాగర్ శర్మ హల్‌చల్ చేయడం తీవ్ర చర్చనీయాంశమవగా.. పార్లమెంట్ సెక్యూరిటీని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఇదే సమయంలో ప్రతిపక్షాలు సైతం బీజేపీ టార్గెట్‌గా ఫైర్ అవుతోంది. ముఖ్యంగా హోం మంత్రి అమిత్‌షాపై మండిపడుతోంది. అమిత్‌షా ఇప్పటివరకు స్పందించలేదేం? ఘటన జరిగి గంటలు గడుస్తున్నా ఇప్పటివరకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నుంచి ప్రకటన రాకపోవడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. రేపు(డిసెంబర్ 14) పార్లమెంట్‌లో జరగనున్న సమావేశాల్లో అమిత్‌షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తోంది కాంగ్రెస్. లోక్‌సభ, రాజ్యసభ రెండిటిలోనూ అమిత్‌షా వివరణ ఇవ్వాల్సి ఉంటుందని పట్టుబడుతున్నాయి. భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని ఈ ఘటన రుజువు చేస్తుందంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ రోజు లోక్‌సభలో జరిగిన అసాధారణ సంఘటనలు, ఈ విషయంపై ప్రకటన చేయడానికి హోంమంత్రి నిరాకరించడంపై ‘INDIA’ పార్టీలు ఈ మధ్యాహ్నం రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి. 22 ఏళ్ల క్రితం పార్లమెంట్‌పై దాడి జరిగిన రోజు.. ఇంత భారీ భద్రతా ఉల్లంఘన జరిగింది.’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. The Leader of the House in the Rajya Sabha kept accusing INDIA parties of 'politicising' the shocking and apalling breach of security WITHIN the Lok Sabha today. He had no answers to serious questions being raised on how such a breach could take place in a building heralded by… — Jairam Ramesh (@Jairam_Ramesh) December 13, 2023 ఇటు తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం ట్విట్టర్ వేదికగా ఈ ఘటనపై స్పందించారు. ‘పార్లమెంట్‌లో భద్రతా ఉల్లంఘన మన ప్రజాస్వామ్య దేవాలయానికి ప్రమాదకరమైన ముప్పును కలిగిస్తుంది. జాప్యం లేకుండా సత్వర చర్యలు తీసుకోవాలి. త్వరితగతిన విచారణ ప్రారంభించడం, జవాబుదారీతనం పరిష్కరించడం, భవిష్యత్తులో జరిగే లోపాలను నివారించడానికి చర్యలను అమలు చేయడం కోసం నేను విజ్ఞప్తి చేస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. The unprecedented security breach in the parliament poses a dangerous threat to our august temple of democracy. Swift action must be taken without delay. I appeal for launching a prompt investigation, fixing accountability, and implementing measures to prevent future lapses,… — M.K.Stalin (@mkstalin) December 13, 2023 Also Read: దాడి వెనుక ఉన్నది నలుగురు కాదు.. ఆరుగురు..! మరో ఇద్దరు ఎవరంటే? WATCH: #parliament #parliament-attack మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి