Free Current: సందేహాలు, ప్రశ్నలు.. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్‌పై ప్రజల్లో గందరగోళం!

ఫ్రీ కరెంట్‌పై ప్రజల్లో గందరగోళం నెలకొంది. హైదరాబాద్‌లో ఉంటున్న చాలామందికి ఊర్లల్లో వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. ఇక కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వకుండా పథకం అమలు చేస్తే లక్షలాది మంది లబ్ధిదారులకు నష్టం జరుగవచ్చు.

Current Bill: విద్యుత్‌ బిల్లుల చెల్లింపులో క్యూ ఆర్‌ కోడ్‌ విధానం!
New Update

Free Current Questions: తెలంగాణ ప్రభుత్వం 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తానంటోంది. అయితే ఈ స్కీమ్‌పై ఇప్పటివరకు ఓ క్లారిటీ లేదు. స్పష్టమైన గైడ్‌లైన్స్‌ కూడా ఇవ్వలేదు. అందుకే ఈ 200 యూనిట్ల ఫ్రీ కరెంట్‌పై ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఫ్రీ కరెంట్‌పై జనాల్లో అనేక సందేహాలు ఉన్నాయి. వైట్ రేషన్‌ కార్డు ఉన్నవాళ్లకే ఫ్రీ కరెంట్ అంటోంది ప్రభుత్వం. హైదరాబాద్‌లో ఉంటున్న చాలామందికి ఊర్లల్లో వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. ఫ్రీ కరెంట్‌ ఊర్లో ఇస్తారా? హైదరాబాద్‌లో రెంట్‌కు ఉంటున్న చోట ఇస్తారా అన్నదానిపై ఎలాంటి క్లారిటీ రాలేదు.



అదే చేస్తే లక్షమందికి నష్టం:

ఒక ఇంట్లో ఒక మీటర్‌కే పథకం అమలు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇంటికి ఒకే మీటర్‌ ఫ్రీ అంటే రెంట్‌కి ఉండే వాళ్ల సంగతేంటన్నదానిపై స్పష్టత లేదు. ఇక కొత్త రేషన్‌ కార్డుల కోసం లక్షలాది జనం ఎదురుచూస్తున్నారు. కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వకుండా పథకం అమలు చేస్తే లక్షలాది మంది లబ్ధిదారులకు నష్టం జరుగుతుందన్న ప్రచారం ఉంది. మరి వీటిపై రేవంత్ సర్కార్‌ ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాల్సి ఉంటుంది.

ఇప్పటికే మొదలైన ప్రక్రియ:

వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్‌ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాళ్టి నుంచి క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. ప్రతి నెల మొదటివారంలో 10రోజుల పాటు.. మీటర్‌ రీడింగ్‌తో పాటు లబ్ధిదారుల గుర్తింపు ఉంటుంది. మీటర్‌ రీడింగ్‌ తీసే సిబ్బందితోనే లబ్ధిదారులను గుర్తించాలని నిర్ణయం తీసుకుంది రేవంత్ సర్కార్‌. మీటర్‌ రీడర్‌కు రేషన్‌, ఆధార్‌ కార్డ్‌ నంబర్లతో పాటు, మొబైల్‌ నంబర్‌ లింక్ చేస్తారు. రీడింగ్‌ కోసం తెచ్చిన హ్యాండ్‌ హెల్త్‌ మెషీన్‌లో ఎంట్రీ చేస్తారు. డేటాలో తప్పు నమోదు లేదా అసంపూర్తిగా లేదా డేటా అందుబాటులో లేకుంటే, మీటర్ రీడర్లు వినియోగదారులు సమర్పించిన డేటాను రికార్డ్ చేస్తారు. డేటా భాగస్వామ్యం స్వచ్ఛందంగా ఉంటుంది. వినియోగదారులు డేటాను భాగస్వామ్యం చేయడానికి నిరాకరించవచ్చు. సమాచారాన్ని పంచుకున్న వారి అర్హతను అంచనా వేసి, ఆపై వారిని గృహ జ్యోతి పథకం కిందకు తీసుకువస్తారు.

Also Read: సూర్యునిపై ఉమ్మేస్తే అది తిరిగి మీ మీదే పడుతుంది.. రేవంత్‌పై కవిత ఆగ్రహం!

WATCH:

#free-current
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe