Mudra Benefits : నేటి ఫాస్ట్ ఫార్వర్డ్ లైఫ్(Fast Forward Life) లో ప్రతి ఒక్కరూ కూడా ఒత్తిడి(Stress), ఆందోళనతో సతమతమవుతున్నారు. దీని వల్ల చాలా ఆరోగ్య సమస్య(Health Problems) లొస్తున్నాయి. అయితే, ఎంత బిజీగా ఉన్నా కొందరు ఫోకస్డ్‌గా వారి పనులు వారు చేసుకోగలుగుతారు. దీనికి గల కొన్ని కారణాలలో యోగా ముద్రలు అని కూడా చెప్పొచ్చు. ముద్రలు మన బాడీలో శక్తిని పెంచుతాయి. మనసుని ఏకాగ్రతగా ఉంచుతాయి. వీటిని చేయడం వల్ల కొంతమందిలో అంతర్గత శక్తి పెరుగుతుంది. అలాంటి శక్తిముద్రల గురించి తెలుసుకోండి.
శక్తి ముద్ర(Power Mudra) అనేది కేవలం శరీరానికే కాదు. మనసుకి కూడా ముఖ్యమే. దీని వల్ల శరీరంలో శక్త ప్రసరణ కంట్రోల్ అవుతుంది. ఈ కారణంగా మీరు మరింత శక్తివంతంగా ఉంటారు. ఏకాగ్రత పెరుగుతుంది. జీవితంలో స్పష్టత కోరుకునేవారికి ఈ ముద్ర ఆచరించడం మంచిది. దీని వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.ఈ శక్తి ముద్ర చేయడం చాలా ఈజీనే. కానీ, దీని వల్ల కలిగే ప్రయోజనాలు అద్భుతమనే చెప్పాలి. రెగ్యులర్‌గా చేస్తే తప్పకుండా ఫలితాలుంటాయి. ముందుగా ఇందుకోసం నేలపై నిటారుగా కూర్చోవాలి. వీపుని నిటారుగా, భుజాలని సరిగ్గా ఉంచాలి. మోకాళ్ళని తీసుకొచ్చి అరచేతులపై ఉంచండి. ఇప్పుడు చూపుడు వేలి కొనతో బొటనవేలుని తాకండి. ఇతర వేళ్ళు రిలాక్స్డ్‌గా ఉంటాయి. ఈ ముద్రలో కొన్నిసార్లు శ్వాస తీసుకోవాలి. ప్రశాంతంగా చేయాలి. శక్తి వేలి ద్వారా ప్రవహించి శరీరంలోకి చేరుతుంది. శరీరంలోకి మాత్రమే కాదు.
ప్రతి ఒక్కరి శరీరంలో కూడా ఈ అంతర్గత శక్తి ఉంటుంది. కానీ, దానిని ఎప్పుడూ వాడాలో తెలియదు. శక్తి ముద్రని చేసినప్పుడు అది శరీరంలో అంతర్గత శక్తిని ప్రసరింపజేస్తుంది. దీనిని చేస్తే ఈ శక్తి ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కోవడానికి సాయపడుతుంది. రెగ్యులర్‌గా చేస్తే మనలో దాగి ఉన్న శక్తి సామర్థ్యాలు బయటికి వస్తాయి.ఈ శక్తి ముద్ర గొప్పదనం తెలుసు కాబట్టే, చాలా మంది ప్రముఖులు, సినీ నటులు, రాజకీయ నేతలు ఈ ముద్రని చేస్తారు. చాలా మంది సెలబ్రిటీస్ ఇంటర్య్వూల్లో ఈ ముద్రని వేసి మాట్లాడడం చూసే ఉంటారు.
Also Read : ఇవి తెలుసుకుంటే బంధాలు సుదీర్ఘకాలం కొనసాగుతాయి