Good News For Railways: రైలు టికెట్స్ ఇప్పుడు ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్ కు అయినా బుక్ చేసుకోవచ్చును. ఇంతకు ముందు ఇంత దూరం ఉండాలి.. మధ్యలో ఇన్ని స్టేషన్లు ఉండాలి లాంటి రూల్స్ ఉండేవి. కానీ ఇప్పుడు అలా లేదు. ఎక్కడ నుంచి ఎక్కడకు అయినా టికెట్స్ తీసుకోవచ్చును. ఇప్పుడు దీంతో పాటూ రైల్వే టికెట్ బుకింగ్స్‌లో లోవర్ బెర్త్‌లకు సంబంధించి రూల్స్‌ను చెప్పింది రైల్వేశాఖ. లోవర్ బెర్త్‌లకు విపరీతంగా డిమాండ్ ఉండడంతో ఇవి పెట్టినట్టు తెలిపింది. ఇందులో భాగంగా ఏఏ సెక్షన్లకు ఎలా టికెట్స్ ఇస్తామో తెలిపింది. సీనియర్ సిటిజన్స్‌కు ఆటోమేటిక్‌గా లోవర్ బెర్త్‌లను అలా ఇస్తామని తెలిపింది. వారి వయసును ఎంటర్ చేస్తే చాలు...వారికి లోవర్ బెర్త్ వస్తుందని తెలిపింది.
ఇక ఫస్ట్ క్లాస్, కూపేల్లో అయితే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్దతిలో ఎవరు ముందు టికెట్ బుక్ చేసుకుంటే వారికి లోవర్ బెర్త్‌లను ఇస్తామని తెలిపింది రైల్వేశాఖ. ఇక స్లీపర్ కోచ్‌లలో అయితే సీనియర్ సిటిజన్ కోటాలో ప్రతీ కోచ్‌కు మూడు లోవర్ బెర్త్‌లు వారికే ఉంటాయి. అదే ఏసీ–2 టైర్‌లో అయితే రెండ లోవర్ బెర్త్‌లు అలాట్ చేస్తారు. దీంతో పాటూ ప్రెగ్నంట్ వుమన్, వికలాంగులకు రెండు బెర్త్‌లకు కేటాయిస్తారు. అవి కాక అవైలబిలిటీని బట్టి రిజర్వేషన్ చేసుకున్నప్పుడు లోవర్ బెర్త్‌లు ఉంటే వెంటనే ఇస్తామని తెలిపింది. మగవారు ఇతే 60ఏళ్ళు, ఆడవారు అయితే 45 ఏళ్ళ వయసు ఉంటే వారిని సీనియర్ సిటిజన్స్ కింద పరిగణిస్తారు. వీటితో పాటూ కొన్ని ట్రైన్స్‌లో ఆడవారికి స్లీపర్ క్లాస్‌లలో సెపరేట్‌గా 6 బెర్త్‌లను ఇస్తామని చెప్పింది రైల్వేశాఖ.
Also Read: Smita Sabharwal: హైకోర్టుకు చేరిన స్మితా సబర్వాల్ వ్యవహారం.. కీలక ఆదేశాలు జారీ!