Laugh a Day: గుండె జబ్బుల నుంచి నవ్వు రక్షిస్తుందని జపాన్‌లోని యమగటా యూనివర్సిటీ (Japan Yamagata University) శాస్త్రవేత్తలు వెల్లడించారు. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించటానికి చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని శాస్త్రవేత్తలు తెలిపారు.దీంతో యమగటా ప్రిఫెక్చర్‌లో నివసిస్తున్న ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కొత్త ఆర్డర్‌ను ప్రవేశపెట్టారు.
రోజుకు ఒక్కసారైనా నవ్వడం తప్పనిసరి చేశారు. ప్రతినెలా 8వ తేదీని నవ్వుల దినోత్సవంగా పాటించాలని ప్రజలను జపాన్ లోని యమగటా ప్రభుత్వం ఆదేశించింది. అంటే రోజుకు ఒక్కసారైనా నవ్వడం తప్పనిసరి చేసింది. అలాగే ప్రతి నెల 8వ తేదీని నవ్వుల దినోత్సవంగా పాటించాలని ప్రజలకు సూచించారు. రోజూ నవ్వడం వల్ల ఒత్తిడి, టెన్షన్ తగ్గి ఆరోగ్యవంతమైన జీవితానికి దారితీస్తుందని చెబుతారు. అయితే ఈ ఆర్డర్ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తోందని, అనారోగ్యం లేదా ఇతర కారణాల వల్ల నవ్వలేని వారి హక్కులను ఉల్లంఘించడమేనని అక్కడి కొందరు రాజకీయ నాయకులు విమర్శించారు.