Health Insurance: కేన్సర్ ట్రీట్మెంట్ కోసం ఇన్సూరెన్స్.. బెనిఫిట్స్ ఇవే.. 

హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కేన్సర్ సంబంధిత వ్యాధులకు మంచి కవరేజ్ ఇచ్చే పాలసీలను ఎంచుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మంచి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం వలన కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల కోసం తీసుకునే చికిత్సకు అయ్యే ఖర్చును తట్టుకునే అవకాశం ఉంటుంది. 

Health Insurance Claim: నో టెన్షన్.. హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఇకపై ఈజీగా.. 
New Update

Health Insurance: మన దేశంలో ఇన్సూరెన్స్ అంటే అవగాహన చాలా తక్కువ. ఉద్యోగులుగా ఉన్నవాళ్లు టాక్స్ తప్పించుకోవడం కోసం ఇన్సూరెన్స్ చేయడం సాధారణంగా జరుగుతుంది. ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనే ఆలోచన బాగా తక్కువ. ఇక హెల్త్ ఇన్సూరెన్స్ అంటే అసలు చాలామందికి ఇది ఎలా పనిచేస్తుందో కూడా తెలీదు. ఇప్పుడిప్పుడే పరిస్థితిలో మార్పు వస్తోంది. కరోనా వచ్చిన తరువాత హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాధాన్యతను గుర్తించడం ప్రారారంభం అయింది. ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా రకరకాల పాలసీలను విడుదల చేస్తూ వస్తున్నాయి. ఇప్పుడు చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ప్రారంభించారు. అయితే, హెల్త్ ఇన్సూరెన్స్(Health Insurance) తీసుకోవడం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కవరేజ్ గురించి.. పాలసీకి సంబంధించిన అన్ని విషయాలను స్పష్టంగా తెలుసుకోవాలి. 

ఇక హెల్త్ ఇన్సూరెన్స్(Health Insurance) సాధారణమైనది తీసుకుంటే దాని ఉపయోగాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కేన్సర్ వంటి వ్యాధులకు కవర్ ఇచ్చే పాలసీలను ఎంచుకోవడం చాలా మంచిది. ఎందుకంటే, రోగాలు చెప్పి రావు. అనారోగ్యం వచ్చాకా అయ్యే ఖర్చులను తప్పించుకోవడం చాలా కష్టం. ఒక్కోసారి మనకి చెప్పాపెట్టకుండా వచ్చే పెద్ద అనారోగ్యం కారణంగా బికారులుగా మారిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్(Health Insurance) తీసుకునేటప్పుడు.. కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు సంబంధించి కవర్ ఉండే పాలసీ తీసుకోవాలి.  సాధారణంగా మనలో చాలామంది ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉంది కదా.. ఇప్పుడు ఎందుకు ఈ పాలసీ అని ఆలోచిస్తారు. అలాగే, కేన్సర్ కోసం కవర్ ఎందుకు? కేన్సర్ వస్తుందని ముందే ఊహించడం వేస్ట్ అని అనుకోవాడమూ సహజం. కానీ,  మన దేశంలో క్యాన్సర్ కేసుల సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ 2022 రిపోర్ట్ ప్రకారం, దేశంలో క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య 2022లో ఉన్న 14.6 లక్షల నుంచి 2025 నాటికి 15.7 లక్షలకు పెరుగుతుందని అంచనా వేసింది. 

ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో కేవలం మామూలు హెల్త్ ఇన్సూరెన్స్(Health Insurance) ఒక్కటే సరిపోదు. అలాగే చాలా మంది మామూలు ఇన్సూరెన్స్ పాలసీ కేన్సర్ వంటి వ్యాధులనూ కవర్ చేస్తుందని భావిస్తారు. నిజానికి అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఇటువంటి వ్యాధులకు కవర్ ఇవ్వవు. 

కొన్ని ఇన్సూరెన్స్ కంపనీలు కేన్సర్ కోసం నిర్దిష్టంగా ఇన్సూరెన్స్(Health Insurance) పాలసీలను ఇస్తున్నాయి. అయితే, ఇటువంటి పాలసీలు కాస్త ఖరీదైనవిగా ఉంటాయి. అలాగే, వీటికోసం షరతులు కూడా మామూలు ఇన్సూరెన్స్ తో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి పాలసీలకు సంబంధించిన వివరాలను జాగ్రత్తగా అర్ధం చేసుకుందాం. 

 న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ క్యాన్సర్ గార్డ్ పాలసీ తీసుకువచ్చింది. ఈ పాలసీ కింద, 60 ఏళ్ల నాన్-స్మోకర్ పురుషుడు రూ. 21,103 వార్షిక ప్రీమియం చెల్లించడం ద్వారా రూ. 50 లక్షల బీమా మొత్తాన్ని పొందవచ్చు. మహిళల విషయానికి వస్తే, 56-60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు చెల్లించాల్సిన వార్షిక ప్రీమియం రూ.28,000 వరకు ఉంటుంది. ఎందుకంటే మహిళలు రొమ్ము – గర్భాశయ  క్యాన్సర్‌కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్లాన్ 75 రోజుల వెయిటింగ్ పీరియడ్‌తో వస్తుంది. ఈ ప్లాన్‌లో ఉన్న అతి పెద్ద లోపం ఏమిటంటే, ఇది క్యాన్సర్‌ని తొలిదశలో గుర్తించే విధానాలకు అయ్యే ఖర్చులను  కవర్ చేయదు.

ఆదిత్య బిర్లా కంపెనీ యాక్టివ్ సెక్యూర్ ప్లాన్ అందుబాటులో ఉంచింది. ఇది రూ. 5 లక్షల నుంచి రూ. 1 కోటి మధ్య మంచి ఇన్సూరెన్స్(Health Insurance) మొత్తాన్ని అందించినప్పటికీ, ఈ పాలసీ ప్రారంభ దశ క్యాన్సర్‌కు 180 రోజులు అలాగే క్యాన్సర్ పెద్ద లేదా అధునాతన దశలకు 90 రోజుల వెయిటింగ్ పీరియడ్‌తో వస్తుంది. అంటే క్యాన్సర్ లక్షణాలు ప్రారంభ దశలో 180 రోజులలోపు లేదా ముదిరిన 90 రోజులలోపు అభివృద్ధి చెందితే, మీరు దీని నుంచి ఎటువంటి ప్రయోజనం పొందలేరు.

ఓరియంటల్ నుంచి వచ్చిన  క్యాన్సర్ ప్రొటెక్ట్ ప్లాన్‌ గురించి చూద్దాం. ప్రారంభంలో, ఈ ప్లాన్ క్యాన్సర్ పెరుగుదలను మినహాయిస్తుంది. కానీ ఈ ప్లాన్ 90 రోజుల పోస్ట్ హాస్పిటల్ ఖర్చులను మాత్రమే కవర్ చేస్తుంది. ఆ తరువాత, రోగి తన స్వంతంగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.

Also Read: ఆ మూడు కంపెనీల మార్కెట్ క్యాప్ భారీగా పెరిగింది.. టాప్ లో ఆ కంపెనీ!

ఈ పాలసీ(Health Insurance)లను పరిశీలిస్తే.. 100 శాతం కవరేజీ ఇచ్చే పాలసీలు లేవనే విషయం అర్ధం అవుతుంది కదా. అయితే, ట్రీట్మెంట్ కోసం అవసరం అయ్యే ఖర్చుల్లో చాలాభాగాన్ని భరించే అవకాశం మనకు ఇస్తాయి. మన కుటుంబంలో ఎవరికైనా కేన్సర్ ఉన్న యూ=హిస్టరీ ఉంటె కనుక కేన్సర్ కోసం పాలసీ తీసుకోవడం చాలా మంచిది. చాలామంది ఇండిపెండెంట్ కవర్స్ తీసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. అయితే, దీనివలన ప్రయోజనం లేదు. కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం వలన మంచి ఉపయోగం ఉంటుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. కేన్సర్ కి సంబంధించిన నిర్దిష్ట ఇన్సూరెన్స్ కలిగి ఉన్నట్లయితే, ఆర్ధికంగా సహకారిగా ఉంటుంది. కుటుంబం ఇబ్బందులు పడకుండా ఇది ఉపయోగపడుతుంది.  

గమనిక: ఈ ఆర్టికల్ పాఠకుల ప్రాథమిక అవగాహన కోసం ఇస్తున్నాము. వివిధ సందర్భాల్లో నిపుణులు ఇచ్చిన సూచనలు.. ఇన్సూరెన్స్ మార్కెట్లో ప్రస్తుతం ఉన్న పాలసీల(Health Insurance) ఆధారంగా ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఈ ఆర్టికల్ ఇలాంటి ఇన్సూరెన్స్ తీసుకోవాలనీ, నిర్దిష్టంగా ఇదే పాలసీ తీసుకోవాలని రికమండ్ చేయడం లేదు. ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని అనుకున్నపుడు పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ పరిశీలించి, నిపుణుల సలహా తీసుకుని ముందుకు వెళ్లాల్సిందిగా సూచిస్తున్నాం. 

Watch this Interesting Video:

#health-insurance #health-insurance-policy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe