ఏపీలో కుల గణన ప్రారంభం..అదృష్టమంటున్న మంత్రి! ఏపీలో సమగ్ర కులగణన ప్రక్రియను బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం రాష్ట్రంలో జరగడం అదృష్టమని ఆయన పేర్కొన్నారు. ఈ మహోన్నత కార్యక్రమాన్ని చేపట్టిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. By Bhavana 15 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి వైసీపీ ప్రభుత్వం బుధవారం నుంచి రాష్ట్రంలో సమగ్ర కుల గణనకు శ్రీకారం చుట్టింది. రెండు రోజుల పాటు ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ ప్రక్రియను రామచంద్రాపురం నియోజకవర్గం నేలపర్తిపాడు గ్రామ సచివాలయ పరిధిలో మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ ప్రారంభించారు. రాష్ట్రంలో కులగణన ప్రారంభం కావడం గురించి మంత్రి చెల్లుబోయిన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామ స్వరాజ్యమనే మహాత్ముల లక్ష్యాన్ని సాధించిన నాయకుడు జగన్ అని కొనియాడారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత జనగణన తప్ప కుల గణన జరగలేదని ఆయన వివరించారు. రాష్ట్రంలో అంబేద్కర్ ఆశయాలను దీని ద్వారా జగన్ సాధిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఉన్నతవర్గాల్లోని పేదలతో పాటు, వెనుకబడిన వర్గాల, బడుగు బలహీన వర్గాల జీవితాలలో ఈ కులగణన వెలుగులు నింపనుంది అని మంత్రి వేణు తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ కులగణన జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు. బీసీలకు సేవ చేయడం తనకు ఎంతో ఇష్టమని అభిప్రాయపడ్డారు. సీఎం ఈ బాధ్యతను తనకు అప్పగించడం సంతోషకరంగా ఉందన్నారు. ఈ ప్రక్రియ ప్రతి పేదవాడి జీవితానికి భద్రతగా ఉపయోగపడుతుంందని అన్నారు. ఈ రెండు రోజుల కుల గణన ప్రక్రియను తన నియోజకవర్గమైన నేలపర్తిపాడు గ్రామంలో పరిశీలించినట్లు మంత్రి వివరించారు. పేదవాడి సొమ్మును ఎలా దోచుకోవాలో గత ప్రభుత్వం చూస్తే ..పేదవాడి సొమ్మును ఎలా పేదవారికి చేర్చాలో జగన్ చూస్తున్నారంటూ కొనియాడారు. కులగణన ప్రక్రియలో తనను కీలకమైన భాగస్వామ్యం చేసినందుకు సీఎం వైఎస్ జగన్‌కు మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. Also read: నగరంలో ఆత్మహత్య చేసుకున్న జవాన్! #ap #politics #minister-chelluboyina మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి