దొంగ ఓట్ల నమోదుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

ఏపీ ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారు. ఓడిపోతామని తెలిసి కాంగ్రెస్‌ నేతలు ఓటర్ల జాబితాపై పడ్డారు. 14 నియోజకవర్గాల్లోని ఓటర్ల జాబితాను పరిశీలిస్తే.. 2150 ఇంటి నంబర్లతో 1.85 లక్షల ఓట్లు చేర్పించినట్లు తేలింది.

New Update
 దొంగ ఓట్ల నమోదుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

Complaint to Election Commission about stolen votes

ఏపీలో ఓట్ల దొంగలు దొరికారు

ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారు. ఓడిపోతామని తెలిసి కాంగ్రెస్‌ నేతలు ఓటర్ల జాబితాపై పడ్డారు. 14 నియోజకవర్గాల్లోని ఓటర్ల జాబితాను పరిశీలిస్తే.. 2150 ఇంటి నంబర్లతో 1.85 లక్షల ఓట్లు చేర్పించినట్లు తేలింది. ఒక్కో ఇంటి నంబరుతో 50 నుంచి 500 ఓట్లు చేర్పించారు. ఓ కుటుంబంలో నలుగురు ఓటర్లు ఉంటే, వారిని వేర్వేరు వార్డుల్లోని బూత్‌లకు మార్చేశారు. వాలంటీర్లను ఉపయోగించుకొని, బీఎల్‌వోలపై ఒత్తిడి తెచ్చి ఓటర్ల జాబితాలను తారుమారు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. దొంగ ఓట్ల వ్యవహారంపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, మాజీ మంత్రులు నక్కా ఆనంద్‌బాబు, దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, నేతలు బొండా ఉమామహేశ్వరరావు, దివి శివరాం తదితరులతో కలిసి ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. దొంగ ఓట్లపై ఆధారాలతో సహా సీఈవోకు ఫిర్యాదు ఇచ్చాం. జులై 21 నుంచి అక్టోబరు 7 వరకు ఓటర్ల జాబితా సమగ్ర సవరణ జరుగుతుందని, బీఎల్‌వోలు ప్రతి ఓటరునూ పరిశీలిస్తారని సీఈవో తెలిపారు.

ఆధారాలు ఉన్నాయి

అక్టోబరు 17కి ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలవుతుందని, అందులోనూ ఆరోపణలు ఉంటే, ఆధారాలతో సహా ఫిర్యాదులిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. బీఎల్‌వోలు ఇళ్లకు వెళ్లకుండానే జాబితాలో మార్కుచేస్తున్నారని, గూగుల్‌లో హౌస్‌ మ్యాపింగ్‌ను వినియోగిస్తే.. ప్రతి బీఎల్‌వో ఇంటింటికి వెళ్తున్నారో లేదో తేలుతుందని సీఈవో దృష్టికి తీసుకెళ్లాం. దీనిని పరిశీలిస్తామన్నారని అచ్చెన్నాయుడు తెలిపారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కొందరిలో వ్యతిరేకత కనిపించడం సహజం. తొలిసారిగా ఓ ప్రభుత్వాన్ని, సీఎంను 5 కోట్లమంది వ్యతిరేకిస్తున్నారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలోని పంచభూతాలను దోచుకున్నారు. ఇప్పుడు వీరిదృష్టి ఓటర్ల జాబితాపై పడింది. వీళ్లకు ప్రతీదీ తారుమారు చేయడం అలవాటైపోయింది. 2019 తర్వాత ఎన్నికలన్నీ అలా మానిస్లేట్‌ చేసే గెలిచారు. ఏ ఎన్నికా సక్రమంగా జరగలేదని మేం చెబుతూనే ఉన్నాం. ఇప్పుడు అవన్నీ బయటపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

హైకోర్టులో కేసు వేస్తాం

అధికార యంత్రాంగానికి చెబుతున్నాం. సీఎం, కాంగ్రెస్‌ నేతల ప్రలోభాలకు లొంగి మీరు మానిప్లేట్‌ చేస్తే.. మేం వాచ్‌డాగ్స్‌లా, భూతద్దాలతో వెతికి తప్పుచేసినవారి పేర్లను ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకొచ్చి వారిని ఇంటికి సాగనంపుతాం. ముసాయిదా జాబితాలో తప్పులు ఉంటే కలెక్టర్‌, తహసీల్దార్‌.. ఇలా ఏ స్థాయి వారిపై అయినా చర్యలు తీసుకుంటామని సీఈవో చెప్పారు. బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లినపుడు మీ పార్టీ కేడర్‌ కూడా వారితో వెళ్లి పరిశీలించండని చెప్పారు. దొంగఓట్ల వివరాలు సేకరించాం. ఏ గెజిటెడ్‌ అధికారి సంతకంతో ఎన్ని ఓట్లు చేర్చారనే సమాచారం సిద్ధంచేశాం. హైకోర్టులో కేసు వేస్తాం అని అచ్చెన్నాయుడు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు