Rains: చిత్తడిగా మారిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా జోరువానలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమవగా.. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో పలుచోట్ల రోడ్లన్నీ చెరువులను తలపించాయి.. లోతట్టు వంతెనలపై నుంచి వరద ఉద్ధృతంగా ప్రవహించడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. పలుచోట్ల భారీ వృక్షాలు, విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. లోతట్టు ప్రదేశాల్లో ఉన్న నివాస గృహాల్లోకి నీరు రావడంతో కొన్నిచోట్ల ప్రజలు అవస్థలు పడుతున్నారు

New Update
Rains: చిత్తడిగా మారిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా

Combined Karimnagar district which has become a swamp

హెచ్చరికలు జారీ  

గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తం చిత్తడిగా మారింది. ఓ వైపు ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం సైతం పిల్లలకు సెలవులు పొడిగించింది. ఈ నేపథ్యంలో పెద్దలతో కలిసి పిల్లల సైతం వాగులు వంకల్లో చేపలు పట్టడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. మరోవైపు అధికంగా వరద తీవ్రత ఉండటం వల్ల పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మండలానికి ప్రధాన రహదారి అయినటువంటి వేములవాడ కొదురుపాక గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. గత మూడు సంవత్సరాలుగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించినప్పటికీ ఎవరూ పట్టించుకోవడంలేదని స్థానికులు వాపోతున్నారు. అత్యవసర సేవలో 100 డయల్ చేయాలని బోయిన్‌ పల్లి ఎస్సై మామిడి మహేందర్ వెల్లడించారు.

రాకపోకలు బంద్‌

భారీ వర్షాల కారణంగా కరీంనగర్‌ గ్రామీణ మండలంలో చెర్లబూత్కూర్‌-ఐత్‌రాజ్‌పల్లి గ్రామాల మధ్య వరద ప్రవహించడంతో రాకపోకలు బంద్‌ అయ్యాయి. నగునూరు-తీగలగుట్టపల్లి పాత రహదారిలోని కల్వర్ట్‌పైనుంచి నీరు ప్రవహించింది. గోపాల్‌పూర్‌లో బెజ్జంకి పుట్టయ్య, చెర్లబూత్కూర్‌లో విజ్జగిరి శంకరయ్య, గొట్టపర్తి రాజవీరు ఇళ్లు నేలమట్టమయ్యాయి.

విద్యుత్త్ అంతరాయం
అంతే కాకుండా ఇక ఈసారి వానాకాలంలో పంట సాగు విస్తీర్ణంలో రైతులు పంటలు వేస్తారని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. అనుకున్న విధంగా వర్షాలు పడకపోవడంతో ఇప్పటి వరకు కేవలం కొన్ని ఎకరాల్లోనే అన్ని రకాల పంటలను అన్నదాతలు సాగు చేశారు. అంచనాలో కేవలం 28 శాతం మేరనే పంటలు వేశారు. ఈ వానలతో రాబోయే రోజుల్లో సాగు పనుల సందడి జోరుగా కనిపించే వీలుందని అధికారులు తెలిపారు. నాలుగు జిల్లాల పరిధిలో దాదాపుగా 60కిపైగా చెరువులు కుంటలు అలుగు పారాయి. కొత్తపల్లి మండలంలోని చింతకుంట, శాంతినగర్‌ సహా మరికొన్ని ప్రాంతాల్లో వర్షం వల్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు