Coffee Price: కాఫీ ప్రియులకు నోరు కాలిపోయే వార్త

కాఫీ ఎక్కువగా పండించే దేశాల్లో పంట సరిగా లేకపోవడంతో మన దేశం నుంచి కాఫీ ఎగుమతికి డిమాండ్ పెరిగింది. దీంతో కాఫీ గింజల ధరలు పెరిగాయి. రాబోయే రోజుల్లో కాఫీ గింజల ధరలు భారీగా పెరగవచ్చని అంచనా. అందుకే, మన దేశంలో కాఫీ ధరలు పెరిగే అవకాశం ఉంది. వివరాలు ఆర్టికల్ లో చూడొచ్చు. 

New Update
Coffee Price: కాఫీ ప్రియులకు నోరు కాలిపోయే వార్త

కాఫీ ప్రియులకు చేదు వార్త. రాబోయే రోజుల్లో కాఫీ మీ పెదాలను కాల్చేసే అవకాశం ఉంది. అంటే ఉదయం తాగే కాఫీ ధర(Coffee Price) పెరుగుతుంది. ప్రస్తుతం సాధారణ హోటళ్లలో 15 నుంచి 20 రూ. కొన్ని హైటెక్ హోటళ్లలో 40 నుండి 100 రూ. స్పెషాలిటీ కాఫీ పార్లర్లలో 80 నుండి 800 రూపాయలుగా కప్పు కాఫీ ధర ఉంది. ఈ ధరలు కొద్ది రోజుల్లో కనీసం 5-10 నుండి 30-40 రూపాయల(Coffee Price) పెరుగుదల చూపించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.  నాణ్యమైన కాఫీ తాగాలంటే కాస్త ఎక్కువే చెల్లించాల్సి వస్తుంది. 

ప్రతికూల వాతావరణం కారణంగా, బ్రెజిల్ - వియత్నాం వంటి ప్రధాన కాఫీ ఉత్పత్తి దేశాలు ఆశించిన కాఫీని ఉత్పత్తి చేయలేకపోయాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా కాఫీ కొరత ఏర్పడింది. దీంతో ఇండియన్ కాఫీకి(Coffee Price) విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఒక్క ఏప్రిల్ నెలలోనే దేశం నుంచి విదేశాలకు 40 వేల 434 మెట్రిక్ టన్నుల కాఫీ ఎగుమతి అయినట్లు కాఫీ బోర్డు గణాంకాలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో ఇది మరింత పెరగనుంది. ఇది భారతీయ కాఫీకి ప్రపంచవ్యాప్త డిమాండ్‌కు సూచికగా భావించవచ్చు.

అంతర్జాతీయ స్థాయిలో విపరీతమైన డిమాండ్ ఉండటంతో కాఫీ గింజల ధర(Coffee Price) అమాంతం పెరిగిపోవడం, స్థానికంగా కాఫీ గింజలకు విపరీతమైన డిమాండ్ ఉండడంతో పాటు ధర కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ఏప్రిల్ నెలలో మూడు నాలుగు సార్లు కాఫీ గింజల ధరలు పెరిగాయని, రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని కాఫీ పౌడర్ విక్రయదారులు చెబుతున్నారు.

Also Read: ఎన్నికల వేళ బాంబు పేలుడు.. బాలుడి మృతి!

గ్లోబల్ మార్కెట్ డిపెండెన్స్
‘‘భారత కాఫీ మార్కెట్(Coffee Price) ఎప్పుడూ ప్రపంచ మార్కెట్‌పై ఆధారపడి ఉంటుంది. గ్లోబల్ స్థాయిలో ధరల పెరుగుదల, తగ్గుదల చోటు చేసుకుంటే దేశీయ మార్కెట్‌లోనూ ఇదే విధమైన ఒడిదుడుకులు ఎదురవుతాయి. అందుకే అంతర్జాతీయ మార్కెట్‌ పెరగడంతో రాష్ట్రంలోనూ ధర పెరిగింది’’ అని కాఫీ బోర్డు సీఈవో కె.జి.జగదీష్‌ మీడియాకు చెప్పారు. 

ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్‌లో కాఫీ ధర(Coffee Price) విపరీతంగా పెరగడంతో భారత్‌లోనూ ధర పెరిగింది. దీంతో కాఫీ రైతులు గత 15 ఏళ్లలో అత్యధిక ధరను పొందుతూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. 

కాఫీ ఉత్పత్తిలో కర్ణాటక అగ్రగామిగా ఉంది.  భారతదేశంలో ఉత్పత్తిలో 71% వాటా కలిగి ఉంది. చిక్కమగళూరు, హాసన్, కొడగు జిల్లాలు ముఖ్యంగా కాఫీకి(Coffee Price) ప్రసిద్ధి. మిగిలిన రాష్ట్రాల్లో  కేరళ శాతం 21.  అలాగే  తమిళనాడు శాతం 5. ముఖ్యంగా కర్నాటక కాఫీ నాణ్యతతో కూడుకున్నది కావడంతో దానికి మొదటి నుంచి డిమాండ్ ఉంది. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే కాఫీ ఎక్కువగా విదేశాలకు ఎగుమతి అవుతుంది.

భారతదేశంలో కాఫీ పంట

సంవత్సరంఉత్పత్తి (మెట్రిక్ టన్నులు)విలువ (డాలర్లలో)భారతీయ విలువ (కోట్లలో)
2023-243,96,0001,1468,983
2022-233,88,0001,29010,491
2024 ఏప్రిల్ వరకూ 40,4341551,290
Advertisment
తాజా కథనాలు