Dravid: భారత క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) వరుస దేశవాళీ క్రికెట్ షెడ్యూల్‌పై ఆందోళన వ్యక్తం చేస్తూ బీసీసీఐకి లేఖ రాసిన విషయం తెలిసిందే. కాగా దీనిపై కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించారు. ప్లేయర్స్, ముఖ్యంగా బౌలర్లు గాయాల బారిన పడకుండా ఉండాలంటే మ్యాచ్‌ల మధ్య విరామం ఉండాలనే శార్దూల్ రిక్వెస్ట్ కు ద్రవిడ్ మద్ధతు తెలిపాడు.
షెడ్యూల్ చాలా కఠినంగా ఉంది..
ఈ మేరకు ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ తర్వాత మీడియాతో మాట్లాడిన కోచ్.. దేశవాళీ మ్యాచ్‌ల షెడ్యూల్ చాలా కఠినంగా ఉందని చాలామంది ఆటగాళ్లు తన వద్ద ప్రస్తావించినట్లు చెప్పాడు. 'శార్దూల్ మాత్రమే కాదు.. జట్టులో చాలామంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. భారత్ లాంటి పెద్ద దేశంలో రెస్టు లేకుండా జర్నీ చేయండం కష్టేమ. ఆటగాళ్ల ఇబ్బందుల గురించి తప్పక తెలుసుకోవాలి. విరామం లేని ఆట కోసం ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు' అని చెప్పారు.
ఇది కూడా చదవండి: Revanth: మేము మొదలుపెడితే అక్కడ ఎవరూ మిగలరు.. బీఆర్ఎస్ కు సీఏం వార్నింగ్!
పునరాలోచన చేయాలి..
ఇక ఇలాంటి అంశాలను లేవనెత్తుతూ వారు తమ గళం వినిపించినపుడు దాన్ని తప్పక పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. 'అందరికీ ఆమోదయోగ్యంగా పలు మార్పులు, చేర్పులు చేస్తూ షెడ్యూళ్లను రూపొందించేలా ప్లాన్ చేసుకోవాలి. కొన్ని టోర్నీల నిర్వహణ గురించి ఆటగాళ్లు, కోచ్‌ల అభిప్రాయాలు తెలుసుకొని పునరాలోచన చేయాలి' అంటూ బీసీసీఐకి సూచించాడు ద్రవిడ్.