CM YS Jagan Mohan Reddy Wishes All On The Occasion Of Raksha Bandhan: రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని అక్క, చెల్లెమ్మలకు శుభాకాంక్షలు చెప్పారు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్. బుధవారం ట్వీట్వర్ వేదికగా జగన్ శుభాకాంక్షలు చెప్పారు. 'ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మీరు నాపై చూపుతున్న ప్రేమాభిమానాలకు సదా కృతజ్ఞతుడిని. మీ సంక్షేమమే లక్ష్యంగా.. మీ రక్షణే ధ్యేయంగా పాలన సాగిస్తున్నందుకు సంతోషిస్తూ మీకు ఒక అన్నగా, తమ్ముడిగా ఎప్పుడూ అండగా ఉండానని మాట ఇస్తున్నా' అని పేర్కొన్నారు సీఎం జగన్.
ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబు కుమార్తె వివాహానికి హాజరైన సీఎం జగన్:
అనంతరం సీఎం జగన్ బుధవారం కాకినాడ జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని జగ్గంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబు కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యారు. ఇర్రిపాకలోని ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబు నివాసానికి వెళ్లిన జగన్.. నూతన వధూవరులు అన్నపూర్ణ, సాయి ఆదర్శ్ లను ఆశీర్వదించారు. అంతకు ముందు ఇర్రిపాకలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎంకే సాదర స్వాగతం పలికారు. తిరిగి సీఎం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
సెప్టెంబర్ 2న కడప జిల్లాలో సీఎం పర్యటన:
ఇదిలా ఉంటే.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ సెప్టెంబర్ 2వ తేదీన కడప జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కలెక్టర్ వి విజయ రామ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలో ఒక రోజు పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒకటి, రెండు రోజుల్లో సీఎం జిల్లా పర్యటనపై ఖచ్చితమైన షెడ్యూల్ ని రిలీజ్ చేస్తామని కలెక్టర్ తెలిపారు. సీఎం కార్యక్రమం విజయవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇది కూడా చదవండి: Raksha Bandhan : ప్రధాని మోదీకి రాఖీకట్టిన విద్యార్థులు..!!