Andhra Pradesh : 'ఏపీలో ఇదే జరుగొచ్చు'.. ఎన్నికలపై సీఎం జగన్ సంచలన కామెంట్స్..!

ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ మాదిరిగానే.. తదుపరి ఎన్నికల షెడ్యూల్ కూడా ముందుగా వచ్చే ఛాన్స్ ఉందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నామన్నారు సీఎం.

New Update
Andhra Pradesh : 'ఏపీలో ఇదే జరుగొచ్చు'.. ఎన్నికలపై సీఎం జగన్ సంచలన కామెంట్స్..!

CM YS Jagan : శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే, ఈ కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ముందస్తు ఎన్నికల అంశాన్ని ప్రస్తావించారు. షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చెప్పారు సీఎం జగన్. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా.. పూర్తి సన్నద్ధంగా ఉన్నామని సీఎం జగన్ అన్నారు. మంత్రులు మరింత సమర్థవంతంగా పని చేయాలంటూ దిశానిర్దేశం చేశారు సీఎం జగన్.

గతంతో పోలిస్తే 20 రోజుల ముందుగానే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని సీఎం జగన్(CM Jagan) అభిప్రాయపడ్డారు. తెలంగాణలోనూ 20 రోజుల ముందుగా షెడ్యూల్ వచ్చిందని గుర్తు చేశారు. ఎన్నికల వేళ ప్రతిపక్షాల విమర్శలను తేలికగా తీసుకోవద్దని మంత్రులకు సూచించారు సీఎం. గెలుపే లక్ష్యంగా పని చేయాలంటూ దిశానిర్దేశం చేశారు. అవసరమైతే భవిష్యత్తులో మరిన్ని మార్పులు ఉంటాయని తెలిపారు సీఎం జగన్.

అయితే, కేబినెట్ భేటీలో సీఎం జగన్ చేసిన ఈ కామెంట్స్ పార్టీ నేతల్లో కొత్త టెన్షన్ క్రియేట్ చేస్తోంది. కేబినెట్ బేటీ తరువాత మంత్రుల్లో మరి కొందరిని నియోజకవర్గాలు మార్చే ఛాన్స్ ఉందంటూ ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గా అభ్యర్థులను మార్చారు సీఎం జగన్. తాజాగా కూడా మరో మూడు నియోజకవర్గాలకు ఇన్‌చార్జులను మార్చారు. భవిష్యత్‌లో మరికొందరు ఇన్‌ఛార్జులను మార్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్‌లు.

Also Read:

అసెంబ్లీని కూలుస్తారా? సీఎం రేవంత్‌ సంచలన రిప్లై..!

100 ఎకరాల్లో కొత్త హైకోర్టు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

Advertisment
Advertisment
తాజా కథనాలు