CM Kejriwal: లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని అధికారంలోకి తెచ్చేందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాష్ట్రాల పర్యటన మొదలు పెట్టారు. ఈరోజు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో లో పర్యటించారు సీఎం కేజ్రీవాల్(Kejriwal). యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కేజ్రీవాల్ కు స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ మరోసారి బీజేపీ పై విమర్శల దాడికి దిగారు.
ALSO READ: ఈడీకి సుప్రీం కోర్టు షాక్
కేజ్రీవాల్ మాట్లాడుతూ.."ఈ రోజు, నేను లక్నోలో ఇండియా కూటమికి ఓటు వేయాలని యూపీ ఓటర్లను అభ్యర్థించడానికి వచ్చాను. నేను నాలుగు విషయాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ముందుగా ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ అమిత్ షాను ప్రధానిని చేసేందుకు ఓట్లు అడుగుతున్నారు. రెండవది, బీజేపీ అధికారంలోకి వస్తే, 2-3 నెలల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను తన పదవి నుండి తొలగిస్తారు. మూడవది, రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు, SC, ST రిజర్వేషన్లు తొలగించబడతాయి. నాల్గవది, జూన్ 4న ఇండియా కూటమి అధికారంలోకి వస్తోంది." అని అన్నారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) మాట్లాడుతూ, "పీఎం మోదికి సెప్టెంబర్ 17, 2025 నాటికి 75 ఏళ్లు నిండుతాయి. అమిత్ షాను తన వారసుడిగా చేయాలని పీఎం మోదీ నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్ 17, 2025 న ప్రధానిని చేయాలని నిర్ణయించుకున్నారు ... పీఎం మోదీ ఇంకా చెప్పలేదు 75 ఏళ్ల తర్వాత పదవీ విరమణ చేయను అని, ప్రధాని మోదీయే ఈ నియమం పెట్టారు, ఆయన ఈ నియమాన్ని పాటిస్తారని నాకు పూర్తి ఆశ ఉంది.’’అని పేర్కొన్నారు.