Kejriwal: 2 నెలల్లో సీఎం మారబోతున్నాడు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు లోక్ సభ ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి వస్తే 2-3 నెలల్లో యూపీ సీఎం పదవి నుంచి యోగిని బీజేపీ అధిష్టానం తొలిగించే కుట్ర చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు కేజ్రీవాల్. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చబోతుందని.. SC, ST రిజర్వేషన్లను రద్దు చేస్తుందని ఆరోపించారు. By V.J Reddy 16 May 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి CM Kejriwal: లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని అధికారంలోకి తెచ్చేందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాష్ట్రాల పర్యటన మొదలు పెట్టారు. ఈరోజు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో లో పర్యటించారు సీఎం కేజ్రీవాల్(Kejriwal). యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కేజ్రీవాల్ కు స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ మరోసారి బీజేపీ పై విమర్శల దాడికి దిగారు. ALSO READ: ఈడీకి సుప్రీం కోర్టు షాక్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.."ఈ రోజు, నేను లక్నోలో ఇండియా కూటమికి ఓటు వేయాలని యూపీ ఓటర్లను అభ్యర్థించడానికి వచ్చాను. నేను నాలుగు విషయాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ముందుగా ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ అమిత్ షాను ప్రధానిని చేసేందుకు ఓట్లు అడుగుతున్నారు. రెండవది, బీజేపీ అధికారంలోకి వస్తే, 2-3 నెలల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను తన పదవి నుండి తొలగిస్తారు. మూడవది, రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు, SC, ST రిజర్వేషన్లు తొలగించబడతాయి. నాల్గవది, జూన్ 4న ఇండియా కూటమి అధికారంలోకి వస్తోంది." అని అన్నారు. #WATCH | Lucknow, UP: Delhi CM Arvind Kejriwal says "Today, in Lucknow I have come to request the voters of UP to vote for the INDIA alliance. I want to talk about four issues. First, in this election PM Modi is asking for votes for Amit Shah, to make him the PM. Second, If BJP… pic.twitter.com/OcGHu6LTCx — ANI (@ANI) May 16, 2024 ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) మాట్లాడుతూ, "పీఎం మోదికి సెప్టెంబర్ 17, 2025 నాటికి 75 ఏళ్లు నిండుతాయి. అమిత్ షాను తన వారసుడిగా చేయాలని పీఎం మోదీ నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్ 17, 2025 న ప్రధానిని చేయాలని నిర్ణయించుకున్నారు ... పీఎం మోదీ ఇంకా చెప్పలేదు 75 ఏళ్ల తర్వాత పదవీ విరమణ చేయను అని, ప్రధాని మోదీయే ఈ నియమం పెట్టారు, ఆయన ఈ నియమాన్ని పాటిస్తారని నాకు పూర్తి ఆశ ఉంది.’’అని పేర్కొన్నారు. #WATCH | Lucknow, UP: Delhi CM Arvind Kejriwal says, "PM Modi will turn 75 on September 17, 2025. PM Modi has decided to make Amit Shah his successor and to make him PM on September 17, 2025...PM Modi has not yet said that he will not retire after 75 years, PM Modi has made this… pic.twitter.com/4XvAwatjkj — ANI (@ANI) May 16, 2024 #arvind-kejriwal #kejriwal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి