CM Revanth: నేడు సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్.. ఆరు గ్రారెంటీలపై కీలక ప్రకటన?

సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సచివాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల దరఖాస్తును డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులతో కలిసి సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు.

New Update
Telangana: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Press Meet: ఈ రోజు సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టనున్నారు. ఆరు గ్యారంటీల దరఖాస్తును లాంచ్ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్‌ కసరత్తు మొదలుపెట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు లబ్దిదారులను ఎంపిక చేసేందుకు.. సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా 10రోజుల పాటు గ్రామ సభలు ఏర్పాటు చేసి.. ప్రజల నుంచి నేరుగా అధికారులు దరఖాస్తులు తీసుకోనున్నారు.

ALSO READ: ఓటుకు రూ.3,000.. మహిళలకు పట్టు చీర!

* అభయహస్తం ప్రజా పాలన దరఖాస్తు పేరుతో అప్లికేషన్ ఫారం రెడీ చేసింది ప్రభుత్వం. అన్ని పథకాలకూ ఒకే అప్లికేషన్ ను సిద్ధం చేసింది. కుటుంబ యజమాని పేరు, పుట్టిన తేదీ, ఆధార్ కార్డు నెంబర్, రేషన్ కార్డు నెంబర్, మొబైల్ నెంబర్, వృత్తి, ఇలా కుటుంబ సభ్యుల వివరాలను నింపాలి.

* మహాలక్ష్మి పథకం కింద ఆర్థిక సాయం పొందేందుకు అందుకు సంబంధించిన గడిలో టిక్ మార్కు పెట్టాలి. రూ.500 సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పొందాలనుకునే వాళ్లు గ్యాస్ కనెక్షన్ నెంబర్, ఏజన్సీ పేరు, ఏడాదికి వినియోగిస్తున్న సిలిండర్ల సంఖ్య నమోదు చేయాలి.

* ఇక రైతు భరోసా కోసం లబ్ది పొందే వ్యక్తి..రైతా, కౌలు రైతా టిక్ చేసి..పట్టాదారు పాసు పుస్తకం నెంబర్, సాగు చేస్తున్న భూమి ఏకరాలను పేర్కొనాలి. ఒకవేళ రైతు కూలీ అయితే.. ఉపాధి హామీ కార్డు నెంబర్ నమోదు చేయాలి.

ALSO READ: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. పురుషులకు ప్రత్యేక బస్సులు?

* ఇక ఇందిరమ్మ ఇళ్లు పొందాలనుకునే వాళ్లు..ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కావాలనుకుంటున్నారా లేదా అన్నది టిక్ చేయాలి.
* ఇక గృహ జ్యోతి పథకం కోసం.. నెలలో ఎంత విద్యుత్ వినియోగిస్తారన్నది యూనిట్లలో నమోదు చేయాలి. దీంతో పాటు విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్యను కూడా నమోదు చేయాలి.

* ఇక చేయూత పథకం పొందాలనుకునేవారు..దివ్యాంగులైతే అందుకు సంబంధించిన బాక్సులో టిక్ పెట్టాలి. లేదా.. వాళ్లు వృద్ధులా, వితంతువుల, బీడీ కార్మికులా, చేనేత కార్మికులా అన్నది వాళ్లకు సంబంధించిన బాక్సులో టిక్ పెట్టాల్సి ఉంటుంది.

* ఈ దరఖాస్తులకు ఆధార్ కార్డు జిరాక్స్‌తో పాటు, వైట్ రేషన్ కార్డు జిరాక్స్‌ను కూడా జతచేయాలి. ఇలా నింపిన దరఖాస్తును గ్రామసభలో అధికారికి అందించి..వాళ్లు అడిగిన వివరాలు చెప్తే.. వాళ్లు చెక్ చేసి దరఖాస్తు దారు ఏఏ పథకానికి అర్హులన్నది నిర్ణయిస్తారు. అలా.. దరఖాస్తు చివర్లో ఉన్న రశీదులో నమోదు చేసి.. సంతకం చేసి, ప్రభుత్వ ముద్ర వేసి ఇస్తారు.

ALSO READ: BREAKING: భారత్ లో భారీ భూకంపం!

Advertisment
Advertisment
తాజా కథనాలు