Hyderabad: హైదరాబాద్‌పై సీఎం స్పెషల్ ఫోకస్.. రాత్రి హోటళ్లు, నాలాల కబ్జ, ఉస్మానియా ఆసుపత్రిపై కీలక ప్రకటన!

మద్యం షాపులు మినహా హైదరాబాద్ నగరంలో రాత్రి 1 వరకూ అన్ని వ్యాపారాలు చేసుకోవచ్చని సీఎం రేవంత్ తెలిపారు. ఇక ఎస్‌వోటీ, గ్రేహండ్స్‌ తరహాలోనే తమ హయాంలో హైడ్రా తెస్తున్నామని చెప్పారు. ప్రస్తుత ఉస్మానియా ఆసుపత్రిని గోషామహల్ పోలీస్ క్వార్టర్స్ లోకి తరలిస్తామన్నారు.

New Update
Hyderabad: హైదరాబాద్‌పై సీఎం స్పెషల్ ఫోకస్.. రాత్రి హోటళ్లు, నాలాల కబ్జ, ఉస్మానియా ఆసుపత్రిపై కీలక ప్రకటన!

CM Revanth: హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి 1 గంట వరకు మద్యం షాపులు తప్ప మిగతా ఏ వ్యాపారమైనా నడిపించుకోవచ్చని సీఎం రేవంత్ తెలిపారు. వైన్ షాపులకు ఈ అవకాశం ఇస్తే విచ్చలవిడిగా తాగే అవకాశం ఉందని, అందుకే దాన్ని మినహాయిస్తున్నట్లు చెప్పారు. రాత్రి 11 గంటలకే రెస్టారెంట్లు, హోటళ్లు మూసివేయడంతో ఇబ్బంది అవుతోందని పలువురు సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఉస్మానియా ఆసుపత్రిని తరలిస్తామని చెప్పారు. ప్రస్తుత ఉస్మానియా ఆసుపత్రిని గోషామహల్ పోలీస్ క్వార్టర్స్ లోకి తరలిస్తామన్నారు. 30 ఎకరాల్లో హాస్పిటల్ కోసం భవనం నిర్మిస్తామని, పాత ఉస్మానియా ఆసుపత్రిని హెరిటేజ్ భవనంగా కొనసాగిస్తామని అసెంబ్లీలో వెల్లడించారు.

అక్రమాల నివారణకే హైడ్రా..
ఇక హైదరాబాద్‌లో అక్రమాల నివారణకే హైడ్రా తెస్తున్నామని, దీని పరిధి 2వేల కిలోమీటర్లకు విస్తరించామని అన్నారు. ఎస్‌వోటీ, గ్రేహండ్స్‌ తరహాలోనే తమ హయాంలో హైడ్రా తెస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో ఇంటి నెంబర్లు మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంతో పోటీ పడేలా చేసేందుకే సంస్కరణలు తెస్తున్నామని, వైఎస్‌ఆర్‌, ఓఆర్‌ఆర్‌ నిర్మిస్తే కొందరు దాన్ని తాకట్టు పెట్టారని, ఓఆర్‌ఆర్‌ను తాకట్టు పెట్టిన వారు సభ నుంచి పారిపోయారని విమర్శించారు. అలాగే హైదరాబాద్‌లో సరస్సులు మాయమవుతున్నాయి. నాలాల కబ్జాలతో హైదరాబాద్‌ అతలాకుతలమవుతోంది. మల్లన్నసాగర్ నుంచి ఉస్మాన్‌సాగర్‌కు జలాల తరలింపునకు ప్రణాళిక సిద్ధం చేశాం. రూ.6వేల కోట్ల ప్రతిపాదనలు ప్రధాని, జలశక్తిశాఖ మంత్రికి ఇచ్చాం. గతంలో రాత్రి 11 తర్వాత విచ్చలవిడిగా గంజాయి దొరికేది. ఇప్పుడు హైదరాబాద్‌లో ఎవరికైనా గంజాయి అమ్మే దమ్ముందా? పబ్బు, ఫామ్‌హౌస్‌ల్లో డ్రగ్‌ రాకెట్లతో ఎవరికి సంబంధం ఉందో చర్చించే దమ్ముందా? బీఆర్ఎస్ నేతలు సభలో ఉన్నప్పుడు డ్రగ్‌ రాకెట్లపై చర్చకు సిద్ధం. మాకు అందరి జాతకాలు తెలుసు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నందున కొన్ని అంశాలపై చర్చించట్లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు