CM Revanth : రైతుబంధుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.!

రైతులకు పంట పెట్టుబడి సాయం చెల్లింపులు ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ట్రెజరీలో ఉన్న నిధులను విడుదల చేయాలని స్పష్టం చేశారు. దీంతో రైతుల‌కు పంట పెట్టుబ‌డి సాయం వారి ఖాతాల్లో జ‌మ కానుంది.

New Update
పెద్దమ్మ గుడి నుంచి ఎల్బీ స్టేడియానికి...

CM Revanth Reddy: తెలంగాణలోని రైతులకు గుడ్ న్యూస్. రైతుబంధు పథకంపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతులకు పంట పెట్టుబడి సాయం చెల్లింపులు ప్రారంభించాలని చెప్పారు. ట్రెజరీలో ఉన్న నిధులను విడుదల చేయాలని స్పష్టం చేశారు. దీంతో రైతుల‌కు పంట పెట్టుబ‌డి సాయం వారి ఖాతాల్లో జ‌మ కానుంది. గతంలో మాదిరిగా రైతులకు ఈ చెల్లింపులు చేయాలని సూచించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన రైతు భరోసా పథకానికి ఇంకా విధివిధానాలు ఖరారు కాకపోవడంతో సీఎం రేవంత్ ప్రస్తుతానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నేడు రైతుబంధు పథకంపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమీక్షకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తదితరులు హాజరయ్యారు.

Also read: ఇకనైనా సకాలంలో జీతాలివ్వండి.. ప్రభుత్వ టీచర్ ఆత్మహత్యా యత్నం

రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు రైతుబంధు స్కీమ్‌ను తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. ఎకరానికి ఏటా రూ. 10వేలు జమ చేస్తూ వచ్చింది. ఎన్నికల హామీల్లో భాగంగా.. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ స్కీమ్‌పై ప్రకటన చేసింది. రైతుభరోసా స్కీమ్ కింద రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పింది. ఏటా రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15,000 పెట్టుబడి సాయం అందజేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. ఏటా వ్యవసాయ కూలీలకు రూ.12వేల ఆర్థిక సాయం అందిస్తామంది. కేసీఆర్ హయాంలో అమలైన రైతుబంధు స్కీమ్‌ అమలు తీరుపై అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్.. అధికారంలోకి రావడంతో సాగుచేసే వారికి మాత్రమే పెట్టుబడి సాయం అందేలా చర్యలు తీసుకోబోతోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు