CM Revanth Reddy: ఈ నెల 16న సీఎం రేవంత్‌ రెడ్డి కీలక భేటీ

TG: ఈ నెల 16న సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో భేటీ కానున్నారు. సచివాలయంలో వారితో సమావేశం కానున్నారు. ప్రజపాలన, ధరణి, వ్యవసాయం, విద్య, వైద్యం, శాంతి భద్రతలు, డ్రగ్స్ నిర్మూలన వంటి కీలక అంశాలపై రేవంత్‌ రెడ్డి సమీక్ష చేయనున్నారు.

New Update
CM Revanth Reddy: ఈ నెల 16న సీఎం రేవంత్‌ రెడ్డి కీలక భేటీ

CM Revanth Reddy:16న సీఎం రేవంత్‌ రెడ్డి కీలక భేటీ నిర్వహించనున్నారు. సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సుదీర్ఘ సమావేశం జరగనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. 9 అంశాలపై అధికారులతో సీఎం చర్చించనున్నట్లు సమాచారం. ప్రజపాలన, ధరణి, వ్యవసాయం, విద్య, వైద్యం, వన మహోత్సవం, మహిళా శక్తి, శాంతి భద్రతలు, డ్రగ్స్ నిర్మూలన వంటి కీలక అంశాలపై రేవంత్‌ రెడ్డి సమీక్ష నిర్వహిస్తారు. సీఎంతో పాటు సమీక్షలో పలువురు మంత్రులు పాల్గొననున్నారు.

ఈరోజు హైడ్రాపై సమీక్ష

సచివాలయంలో ఈరోజు హైదరాబాద్ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌పై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో కీలక సేవలకు హైడ్రా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విస్తృత సేవలందించేలా హైడ్రా రూపొందించాలని సీఎం భావిస్తున్నారు. విపత్తుల నిర్వహణ, చెరువులు, నాలాల బాధ్యతలు హైడ్రాకు ఇచ్చే యోచనలో రాష్ట్ర సర్కార్ ఉంది.

Advertisment
తాజా కథనాలు