CM Revanth Reddy: సెక్రటరీల సమావేశంలో సీఎం రేవంత్ కీలక ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేయడం మర్చిపోయారని అన్నారు. ప్రతీ నెలా సెక్రటరీలతో సమావేశం ఉంటుందని చెప్పారు. వచ్చామా.. వెళ్లామా అన్నట్టు పని చేస్తే కుదరదు అని ఎచ్`హెచ్చరించారు. పని చేసే అధికారులకు నా సహకారం ఉంటుందని అన్నారు. ఇకపై తాను కూడా ఫీల్డ్ విజిట్, ఆకస్మిక తనిఖీలు చేస్తానని చెప్పారు. కాగా ఈరోజు సచివాలయంలో అన్ని శాఖల కార్యదర్శులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
Also Read: ఇక నుంచి కరెంటు బిల్లు ఇలా చెల్లించండి.. పూర్తి వివరాలు