CM Revanth Reddy: ఢిల్లీ పర్యటన ముగించుకున్న సీఎం రేవంత్ హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ రోజు మాదాపూర్ లోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న తన సోదరుడు తిరుపతి రెడ్డిని పరామర్శించారు. రేవంత్ రెడ్డితో పాటు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కలిసి ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి డాక్టర్ శరత్ తో సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తిరుపతిరెడ్డి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. తిరుపతి రెడ్డి ఆరోగ్యం ఏం పర్వాలేదని వైద్యులు సీఎం రేవంత్ కు చెప్పారు. త్వరలో ఆయన పూర్తిగా కోలుకుంటారని తెలిపారు.
ALSO READ: కాంగ్రెస్ తొలి జాబితా.. రాహుల్ గాంధీ పోటీ చేసేది అక్కడి నుంచే!
అసలేం జరిగిందంటే...
సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి గురువారం అస్వస్థతకు గుయారైయ్యారు. హైదరాబాద్‌లో ఉండగా తిరుపతి రెడ్డి అస్వస్థతకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన్ను మాదాపూర్‌లోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన తిరుపతి రెడ్డికి యాంజియోగ్రామ్ చేసిన వైద్యులు.. గుండె నరాల్లో బ్లాక్స్ ఉన్నాయని గుర్తించారు. వెంటనే ఆయన గుండెకు స్టంట్ వేశారు. ప్రస్తుతం అయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని బంధువులు తెలిపారు. విషయం తెలుసుకున్న రేవంత్ తమ్ముడు కొండల్‌రెడ్డి మెడికవర్ ఆస్పత్రికి వచ్చి సోదరుడి వైద్య సేవల్ని పర్యవేక్షించారు.
నా కుటుంబ సభ్యులు రాజకీయాలకు దూరం: సీఎం రేవంత్
ఇటీవల మీడియాతో జరిగిన చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు తిరుపతి రెడ్డికి మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ ఇస్తారని జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు. తన కుటుంబం నుంచి రాజకీయాల్లోకి ఎవరు రారు అని తేల్చి చెప్పారు. తన కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ.. ప్రభుత్వం నుంచి గానీ ఎలాంటి పదవులు, బాధ్యతలు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి కొందరు లబ్ది చెందుతున్నారని సీఎం అన్నారు.