CM Revanth Reddy Tweet on KCR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్ లో బాత్ రూంలో కాలుజారి పడిపోయిన విషయం తెలిసిందే. కేసీఆర్ ఎడమ కాలి తుంటి మార్పిడి చేయాలని డాక్టర్లు తెలిపారు. ఆయనకు సిటీ స్కాన్ చేసి తుంటి విరిగినట్లు వైద్యులు వివరించారు. కాగా, మాజీ సీఎం కేసీఆర్ పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు నివేదించాలని ఆరోగ్య శాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
సీఎం ఆదేశాలతో యశోద హాస్పిటల్‌కు వెళ్లిన వైద్యాధికారులు యశోద ఆసుపత్రి వైద్యులను అడిగి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని యశోద వైద్యులు హెల్త్ సెక్రటరీకి చెప్పారు. కేసీఆర్ హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన యశోద యాజమాన్యం 6 నుంచి 8 వారాలపాటు కేసీఆర్‌కు రెస్ట్ అవసరమంటూ తెలిపారు.ఇదిలా ఉండగా, కేసీఆర్ ఆరోగ్యంపై అటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో సహా రాజకీయ ప్రముఖులు అందరూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
కేసీఆర్ సంపూర్ణంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. పూర్తి ఆరోగ్యంతో మళ్లీ ప్రజలకు సమాజానికి తన సేవలు కొనసాగిస్తారని ఆకాంక్షిస్తున్నారు.