CM Revanth Reddy: నేడు వరంగల్‌లో సీఎం రేవంత్ పర్యటన

TG: సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకొని హెలికాఫ్టర్ ద్వారా వరంగల్‌కు చేరుకుంటారు. అక్కడ జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈరోజు మహిళ శక్తి క్యాంటీన్లను ప్రారంభిస్తారు.

New Update
CM Revanth Reddy: నేడు వరంగల్‌లో సీఎం రేవంత్ పర్యటన

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకొని ఈరోజు తిరిగి హైదరాబాద్ కు రానున్నారు సీఎం. అనంతరం హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ ద్వారా వరంగల్ కు చేరుకుంటారు. అనంతరం వరంగల్, హనుమకొండలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

సీఎం రేవంత్ పర్యటన వివరాలు..

* ఢిల్లీ పర్యటన ముగించుకొని 12.40 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు.
* అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ లో బయల్దేరి వరంగల్ జిల్లా గీసు, కొండ మండలం శాయంపేటలోని మెగా టెక్స్టైల్ పార్కుకు సంబంధించిన అధికారులతో సమీక్ష నిర్వహించి, ఫొటో ఎగ్జిబిషన్ తిలకిస్తారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటుతారు.
* మధ్యాహ్నం 2.10 గంటలకు వరంగల్ లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని పరిశీలిస్తారు.
* 2.45 గంటలకు హనుమకొండ కలెక్టరేట్ కు చేరుకుని మహిళ శక్తి క్యాంటీన్లను సహచర మంత్రులతో కలిసి ప్రారంభిస్తారు.
* మధ్యాహ్నం 3 గంటలకు వరంగల్ మహానగర అభివృద్ధిపై మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.
* సాయంత్రం 5.40 గంటలకు హంటర్ రోడ్డులో నూతనంగా నిర్మితమైన మెడికవర్ హాస్పిటల్ ను ప్రారంభించనున్నారు.

Advertisment
తాజా కథనాలు