Rythu Runa Mafi: రేపే రూ.2 లక్షల రుణమాఫీ!.. టింగ్ టింగ్ మని మోగనున్న ఫోన్లు

TG: మూడో విడత కింద రూ.2 లక్షలలోపు రైతుల రుణాలను మాఫీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సీఎం రేవంత్ రేపు రుణమాఫీ నిధులను విడుదల చేయనున్నారు. నేడు లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇప్పటికే రెండు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసిన విషయం తెలిసిందే.

New Update
Rythu Runa Mafi: రేపే రూ.2 లక్షల రుణమాఫీ!.. టింగ్ టింగ్ మని మోగనున్న ఫోన్లు

Rythu Runa Mafi: రైతులకు మరో గుడ్ న్యూస్ అందించింది రేవంత్ రెడ్డి సర్కార్. మూడో విడత రుణమాఫీకి సిద్ధమైంది. మూడో విడత కింద రూ.1,50,000 నుండి రూ.2,00,000 వరకు రుణాలను మాఫీ చేయనుంది.ఈరోజు లబ్ధిదారుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇప్పటికి వరకు రెండు విడతల్లో రుణమాఫీ చేసి అప్పుల నుంచి రైతులను విపుక్తి చేసింది రేవంత్ సర్కార్. ఎన్నికల సమయంలో అధికారంలోకి రాగానే రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఆగస్టు 15లోపు రూ.2లక్షల రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

రేపే నిధులు విడుదల..

తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ ఈరోజు తిరిగి స్వరాష్ట్రానికి రానున్నారు. రేపు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. సీతారామ ప్రాజెక్టు పంపు హౌజ్ ల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం వైరాలో రైతు రుణమాఫీ బహిరంగ సభకు హాజరవుతారు. రేపు రూ.1.5 లక్షల నుండి రూ.2 లక్షల రుణమాఫీకి నిధులు విడుదల చేయనున్నారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి ఈ పర్యటనలో కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా పెన్షన్ పెంపు, మహిళలకు రూ.2500 వంటి పథకాలను రేపు ప్రారంభిస్తారనే చర్చ పార్టీ వర్గాల్లో నెలకొంది. కాగా సీఎం రేవంత్ రెడ్డి ఈ సభలో ఎలాంటి హామీల వర్షం కురిపిస్తారనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది.

Advertisment
తాజా కథనాలు