Job Calender: నేడు జాబ్‌ క్యాలెండర్‌ విడుదల

TG: రాష్ట్రంలో నిరుద్యోగులకు తీపి కబురు అందించేందుకు సిద్ధమైంది రేవంత్ రెడ్డి సర్కార్. ఈరోజు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయనున్నారు. కాగా ఎన్నికల సమయంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

New Update
CM Revanth: వారికి మాత్రమే క్యాబినెట్‌లో ఛాన్స్.. రూల్స్ బ్రేక్ చేయదల్చుకోలేదు

Telangana Job Calender: తెలంగాణలోని నిరుద్యోగులకు అసెంబ్లీ సమావేశాల చివరి రోజున రేవంత్ రెడ్డి సర్కార్ తీపి కబురు అందించనుంది. ఇవాళ ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభం కానుంది. సభలో నేడు జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. శాసనసభలో ప్రకటించనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. జాబ్‌ క్యాలెండర్‌కు చట్టబద్ధత తీసుకువస్తామని ప్రభుత్వం తెలిపింది. ఏటా నిర్దిష్ట కాలవ్యవధిలో నియామకాలు చేపట్టేలా మంత్రి మండలి ఆమోదం తెలిపింది. కాగా ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఆనాడు సీఎం రేవంత్ ప్రకటన చేశారు. తాజాగా ఈరోజు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఏడాది జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయనున్నారు.

కేబినెట్ కీలక నిర్ణయం..

నిన్న జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది రేవంత్ సర్కార్. . ధరణి పోర్టల్ ను భూమాత పోర్టల్ గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త రేషన్ కార్డుల జారీకి సైతం కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు కానుంది. ఈ కమిటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ ఉండనున్నారు. ఈ మీటింగ్ లో అనేక కీలక నిర్ణయాలను తీసుకున్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు రూ.437 కోట్లను కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇంకా జాబ్ క్యాలెండర్ ను సైతం ఆమోదించింది. ఈరోజు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఈ జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయనున్నారు.

Also Read : నీట్‌ యూజీ-2024పై సుప్రీం కోర్టు కీలక తీర్పు

Advertisment
తాజా కథనాలు