Hyderabad Police Commissioner: సీఎంగా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పదవీ బాధ్యతలు చేపట్టగానే అన్ని శాఖలకు సంబంధించి వరుస సమీక్షలు నిర్వహించడం.. ఆపై అనూహ్యమైన నిర్ణయాలు తీసుకోవడం చక చక జరిగిపోతున్నాయి. తాజాగా రాష్ట్రంలోని ప్రధాన కమీషనరేట్లు అయిన హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమీషనర్లను మార్చింది ప్రభుత్వం. ఇన్నిరోజులు లూప్ లైన్ పోస్టుల్లో ఉన్న కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి (Kothakota Srinivas Reddy) హైదరాబాద్ కమిషనరేట్ బాధ్యతలు అప్పగించగా.. రాచకొండకి సుధీర్ బాబు, సైబరాబాద్ కి అవినాష్ మహంతి కి కమిషనర్లు గా పోస్టింగ్ ఇచ్చారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఐపీఎస్ బదిలీలు చేపట్టింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్‌గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాచకొండ సీపీగా సుధీర్ బాబు, సైబరాబాద్ సీపీగా అవినాష్ మహంతిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజెంట్ హైదరాబాద్ సీపీ గా ఉన్న సందీప్ శాండిల్యాను తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డైరక్టర్‌గా నియమించింది.
కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి 1994 IPS బ్యాచ్ కి చెందిన వ్యక్తి.. ప్రస్తుతం తెలంగాణ ఆర్గనైజేషన్స్ అండ్ లీగల్ విభాగానికి అడిషనల్ డీజీపీగా వ్యవహరిస్తున్నారు. ఇక రాచకొండ సీపీ గా నియమితులైన సుధీర్ బాబు ప్రస్తుతం హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ అడిషనల్ సీపీగా ఉన్నారు. AK మహంతి కుమారుడు అవినాష్ మొహంతీ సైబరాబాద్ లో జాయింట్ సీపీగా ఉన్నారు. అతను ఇప్పుడు సైబరాబాద్ సీపీగా పోస్టింగ్ పొందారు.
సీవీ ఆనంద్‌పై బదిలీ వేటు వేసిన తర్వాత హైదరాబాద్ సీపీ రేసులో ముగ్గురి పేర్లు ప్రధానంగా వినిపించాయి. సందీప్ శాండిల్యతో పాటు సంజయ్‌కుమార్ జైన్, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి పేర్లు వినిపించాయి. వీరిలో శ్రీనివాస్ రెడ్డిని నియమిస్తారని అందరూ భావించారు. అయితే ఈసీ ఆదేశాల మేరకు హైదరాబాద్ సీపీగా సందీప్ శాండిల్యను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అతడిని యాంటీ నార్కోటిక్ బ్యూరో కి ట్రాన్స్‌ఫర్ చేసి ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి సీపీగా బాధ్యతలు అప్పగించారు.
కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ముక్కుసూటి తనం.. నిజాయితీ గల ఆఫీసర్.. రాజకీయ నాయకుల ప్రలోభాలకు లొంగని వ్యక్తి. ఈ కారణాల వల్ల ఉమ్మడి రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా తనకి పోస్టింగ్ ఇవ్వడానికి సాహసించలేదు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలోనూ కేసీఆర్ సీపీల జాబితా ఖరారు చేసిన పేర్లలో కొత్తకోట ప్రభాకర్ రెడ్డి పేరు ఉన్నా.. ఆ తర్వాత ప్రభుత్వానికి అనుకూలంగా లేని పరిస్థితుల్లో ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందని అతన్ని తీసుకోవటానికి విముఖత చూపించారు. పోలీసు ఉన్నతాధికారులందరికి కూడా కేకే నియామకం షాకింగ్ న్యూసే. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి షార్ట్ కట్‌లో కేకే ఈజ్ నాట్ ఓకే డిపార్ట్‌మెంట్ అనే పేరున్న వ్యక్తి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా గుమ్మి చక్రవర్తి నియమితులయ్యారు. ప్రస్తుతం యాంటీ నార్కోటిక్స్ బ్యూరోలో చక్రవర్తి ఎస్పీగా పని చేస్తున్నారు. ఆయనను సీఎం తాత్కాలిక చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా నియమిస్తూ డీజీపీ రవి గుప్తా ఉత్తర్వులను జారీ చేశారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని.. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు సీఎం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చక్రవర్తి కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చక్రవర్తి స్థానంలో మరో అధికారిని నియమించుకోవడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ కు సూచించారు. మరోవైపు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ సీపీ DS చౌహన్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
Also Read:
మందు బాబులకు షాక్.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం..!
10వ తరగతి అర్హతతో ఇస్రోలో ఉద్యోగాలు.. 50 వేలకు పైనే జీతం.. వివరాలివే..