CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. ఇకపై TG: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులను ఇక నుంచి ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు. CMRF నిధులు పక్కదారి పట్టకుండా పారదర్శకతతో నిర్వహించాలని సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. By V.J Reddy 02 Jul 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి CM Revanth Reddy: ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తులను ఇక నుంచి ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు. ఇందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో రూపొందించిన వెబ్‌సైట్ https://telangana.gov.in/cm-relief-fund/ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ప్రారంభించారు. CMRF నిధులు పక్కదారి పట్టకుండా పారదర్శకతతో నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఈ నిధులు పక్కదారి పట్టిన నేపథ్యంలో ఈ విధానాన్ని రూపొందించారు. ఇకముందు సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులను ఈ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 15 తర్వాత నుంచి ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తులను స్వీకరిస్తారు. సీఎంఆర్ఎఫ్ కోసం తమ వద్దకు వచ్చే వారి వివరాలు తీసుకుని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తమ సిఫార్సు లేఖను జత చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ లో సంబంధింత దరఖాస్తుదారుడి బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పనిసరిగా ఇవ్వాలి. అప్‌లోడ్ చేసిన తర్వాత సీఎంఆర్ఎఫ్ కు సంబంధించిన ఒక కోడ్ ఇస్తారు. ఆ కోడ్ ఆధారంగా ఒరిజినల్ మెడికల్ బిల్లులను సచివాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్‌ను సంబంధిత ఆస్పత్రులకు పంపించి నిర్ధారించుకుంటారు. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే సీఎంఆర్ఎఫ్ దరఖాస్తును ఆమోదించిన తర్వాత పక్కదారి పట్టే అవకాశం లేకుండా చెక్ పైన తప్పని సరిగా దరఖాస్తుదారుడి అకౌంట్ నెంబర్‌ను ముద్రిస్తారు. #cm-revanth-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి