CM Revanth on Phone Tapping Issue: ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్లు విన్నాం.. వింటే ఏమవుతుందని కేటీఆర్ అంటున్నాడని అన్నారు. ఫోన్లు వింటే ఏ మైతది చర్లపల్లిలో చిప్పకూడు తింటాని కేటీఆర్ కు సీఎం రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. కేటీఆర్ (KTR) బరితెగించి, ఓ తాగుబోతులా.. అచ్చోసిన ఆంబోతులా మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు.
దానికి ఫలితం కేటీఆర్ కచ్చితంగా అనుభవిస్తాడని.. ఫోన్‌ట్యాపింగ్‌పై విచారణ జరుగుతోంది, ఆ తర్వాత జరగాల్సింది జరుగుతుందని అన్నారు. బీఆర్ఎస్ చెప్పినట్లు విన్న అధికారుల పరిస్థితి ఏమైందో చూస్తున్నామని అన్నారు. అప్పుడు మేం వద్దని చెప్పినా ఆ అధికారులు వినలేదు,ఇప్పుడు అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో ఫోన్లలో మాట్లాడాలన్న భయపడాల్సిన పరిస్థితులు ఉండేవని.. ఇప్పుడు ఆ పరిస్థితులు రాష్ట్రంలో లేవని అన్నారు.
Also Read: భూ ఆక్రమణలు, కిడ్నాప్ లు, ఫోన్ ట్యాపింగ్.. ఆర్టీవీతో ఎర్రబెల్లి దయాకర్ సంచలన ఇంటర్య్వూ!