Phone Tapping Issue: ఫోన్‌ట్యాపింగ్‌పై CM రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు ఫోన్‌ట్యాపింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. ట్యాపింగ్ వ్యవహారంపై కేటీఆర్ బరితెగించి, ఓ తాగుబోతులా.. అచ్చోసిన ఆంబోతులా మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. దానికి ఫలితం కేటీఆర్ కచ్చితంగా అనుభవిస్తాడని అన్నారు. By V.J Reddy 29 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి CM Revanth on Phone Tapping Issue: ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్లు విన్నాం.. వింటే ఏమవుతుందని కేటీఆర్ అంటున్నాడని అన్నారు. ఫోన్లు వింటే ఏ మైతది చర్లపల్లిలో చిప్పకూడు తింటాని కేటీఆర్ కు సీఎం రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. కేటీఆర్ (KTR) బరితెగించి, ఓ తాగుబోతులా.. అచ్చోసిన ఆంబోతులా మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. దానికి ఫలితం కేటీఆర్ కచ్చితంగా అనుభవిస్తాడని.. ఫోన్‌ట్యాపింగ్‌పై విచారణ జరుగుతోంది, ఆ తర్వాత జరగాల్సింది జరుగుతుందని అన్నారు. బీఆర్ఎస్ చెప్పినట్లు విన్న అధికారుల పరిస్థితి ఏమైందో చూస్తున్నామని అన్నారు. అప్పుడు మేం వద్దని చెప్పినా ఆ అధికారులు వినలేదు,ఇప్పుడు అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో ఫోన్లలో మాట్లాడాలన్న భయపడాల్సిన పరిస్థితులు ఉండేవని.. ఇప్పుడు ఆ పరిస్థితులు రాష్ట్రంలో లేవని అన్నారు. Also Read: భూ ఆక్రమణలు, కిడ్నాప్ లు, ఫోన్ ట్యాపింగ్.. ఆర్టీవీతో ఎర్రబెల్లి దయాకర్ సంచలన ఇంటర్య్వూ! #cm-revanth-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి