CM Revanth Reddy: బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ ఆత్మబలిదానం.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

TG: బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆత్మబలిదానం చేసుకుందని అన్నారు సీఎం రేవంత్. బీజేపీ గెలిచిన స్థానాల్లో బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయిందని పేర్కొన్నారు. సిద్దిపేటలో హరీష్ రావు వల్లే బీజేపీ మెజారిటీలోకి వెళ్లిందని సంచలన ఆరోపణలు చేశారు.

New Update
CM Revanth Reddy: బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ ఆత్మబలిదానం.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy : లోక్ సభ ఎన్నికల్లో తమకు మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 100 రోజుల పాలనను ప్రజల ముందు పెట్టి ఓట్లు అడిగామని అన్నారు. మా పాలన రెఫరెండంగా ఎన్నికలకు వెళ్ళమని పేర్కొన్నారు. మా పాలన నచ్చితే ప్రజలే తీర్పు ఇవ్వాలని ప్రజలను కోరామని పేర్కొన్నారు. చెరో 8 చోట్ల బీజేపీ, కాంగ్రెస్ గెలిచాయని తెలిపారు. కాంగ్రెస్ కు 41 శాతం ఓట్లు వచ్చాయని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ శాతం ఓట్లు వచ్చాయని పేర్కొన్నారు.

ఓట్లు, సీట్లు పెంచి ప్రజలు తమను ఆశీర్వదించారని హర్షం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా తమ అభ్యర్థి గెలిచారని అన్నారు. 2019లో కాంగ్రెస్ 3 ఎంపీ సీట్లు గెలిస్తే.. ఈసారి 8 సీట్లు గెలిచిందని అన్నారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి ఓట్ల శాతం పెరిగాయని తెలిపారు.

బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆత్మబలిదానం చేసుకుందని అన్నారు. బీజేపీ గెలిచిన స్థానాల్లో బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయిందని పేర్కొన్నారు. సిద్దిపేటలో హరీష్ రావు వల్లే బీజేపీ మెజారిటీలోకి వెళ్లిందని సంచలన ఆరోపణలు చేశారు.లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో దేశంలో పరిస్థితి మారిందని వ్యాఖ్యానించారు.మోదీ ప్రజావ్యతిరేక విధానాలను రాహుల్ దేశ ప్రజలకు వివరించారని తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు