CM Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవ్వబోతుందని ఆర్టీవీ ప్రసారం చేసిన కథనంపై ఆయన స్పందించారు. త్వరలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరుగుతుందన్నారు. కేసీఆర్ కు గవర్నర్, కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి, హరీష్ రావుకు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ పదవులు దక్కుతాయని అన్నారు. బీఆర్ఎస్ కు నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారని చెప్పారు. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుల విలీనంతో లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వస్తుందని అన్నారు. నాలుగు రాజ్యసభ సీట్లకు సమానంగా కవితకు రాజ్యసభ పదవి వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
ఆర్టీవీ ముందే చెప్పింది...
దేశ రాజకీయాల్లో ఎవరు ఊహించని ఒక సంచలన విషయాన్ని ఆర్టీవీ బట్టబయలు చేసింది. నాలుగు గోడల మధ్య రహస్యంగా జరుగుతున్న చర్చలను ప్రజల ముందు తెచ్చింది. త్వరలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుందని చెప్పి సంచలనం సృష్టించింది. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బెయిల్ రాక జైలులో మగ్గుతున్న తన కూతురు ఎమ్మెల్సీ కవితను బయటకు తెచ్చేందుకు, ఎన్నికల్లో ఓటమి తరువాత నేతల ఫిరాయింపులను ఆపేందుకు కేసీఆర్.. తన పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారు.
ఇప్పటికే ఈ విలీనం ప్రక్రియ మొదలు కాగా ఢిల్లీ ఎన్నికల తరువాత ఈ విలీనం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ విలీనంతో గత ఐదు నెలలుగా జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితకు లిక్కర్ స్కామ్ కేసులో బయటకు రానుంది. మరోవైపు బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయడాన్ని బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ కేసీఆర్ మాయలో పడి విలీనం చేస్తే తెలంగాణలో బీజేపీ కనుమరుగు అవుతుందని వారు అధిష్టానాన్ని కోరుతున్నారట. ఈ విలీనం జరుగుతుందా ? లేదా ? అని తెలంగాణ రాష్ట్రంతో సహా యావత్ దేశం వేచి చూస్తోంది.
Also Read : ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కార్తికేయ-2’