CM Revanth Reddy: స్వేచ్ఛను హరిస్తే తెలంగాణ సహించదు.. యువత డ్రగ్స్‌తో నిర్వీర్యం కావొద్దు.. అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష మానవీయ కోణాన్ని విస్మరించకుండా చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తూ ప్రజలకు చేరువ కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అట్టడుగున ఉన్న నిరుపేదకూ సంక్షేమ పథకాలు చేరవేర్చడమే తమ లక్ష్యమన్నారు. అధికారులతో సచివాలయంలో సీఎం రేవంత్ ఈ మేరకు సమీక్ష నిర్వహించారు. By Naren Kumar 24 Dec 2023 in తెలంగాణ ట్రెండింగ్ New Update షేర్ చేయండి CM Revanth Reddy: మానవీయ కోణాన్ని విస్మరించకుండా చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తూ ప్రజలకు చేరువ కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అట్టడుగున ఉన్న నిరుపేదకూ సంక్షేమ పథకాలు చేరవేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. తెలంగాణ సచివాలయంలో రాష్ట్రవ్యాప్తంగా అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఆదివారం ఎస్సార్ శంకరన్ స్ఫూర్తితో అధికారులు పనిచేయాలన్న రేవంత్ రాష్ట్ర నిర్మాణంలో వారిది కీలకపాత్ర అన్నారు. త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ స్వేచ్ఛను హరించే విధానాలను ఉపేక్షించబోదని, ఎంతటి వారినైనా వెనక్కు పంపిస్తుందని వ్యాఖ్యానించారు. ఇది కూడా చదవండి: ఏపీ మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త.. న్యూ ఇయర్ నుంచే బస్సుల్లో ఫ్రీ జర్నీ? సామాజిక న్యాయంతో అభివృద్ధిని సమన్వయం చేస్తూ తెలంగాణ ప్రభుత్వ ఆరు గ్యారంటీలను నిక్కచ్చిగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రభుత్వం, అధికార వర్గం జోడెద్దుల్లా పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు; పౌరుల నైతికాభివృద్దే నిజమైన అభివృద్ధి అన్న అంబేద్కర్ వ్యాఖ్యలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. డ్రగ్స్, గంజాయి మాట వినిపించొద్దు: గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలను ఉక్కుపాదంతో అణచివేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. స్కూళ్లు, కాలేజీలు సహా ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్, మత్తు పదార్థాలు దొరుకుతున్నాయన్న ఆయన ఎవ్వరినీ ఉపేక్షించొద్దని స్పష్టంచేశారు. తెలంగాణ మరో పంజాబ్ కాకుండా కాపాడుకోవాలన్నారు. ఉద్యమ నేపథ్యమున్న ఇక్కడి యువత నిర్వీర్యం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. భూకబ్జాకారులు, అక్రమార్కులపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. సైబర్ నేరాలు ఇప్పుడు అతి పెద్ద సవాలుగా మారాయని, స్పష్టమైన విధానాలతో వాటిని సమర్థంగా ఎదుర్కోవాలని సూచించారు. సోషల్ మీడియాలో వైషమ్యాలను రెచ్చగొట్టేవారిని ఉపేక్షించొద్దని స్పష్టంచేశారు. నకిలీ విత్తనాలు టెర్రరిజం కన్నా ప్రమాదకరం నకిలీ విత్తనాలతో రైతులను మోసం చేయడం టెర్రరిజం కన్నా ప్రమాదకరమైనదని, దీన్ని అరికట్టి తీరాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా ఆదేశించారు. నకిలీ విత్తనాలు రైతుల ఆత్మహత్యలకూ కారణమవుతాయన్నారు. ఇది కూడా చదవండి: ABP-CVoter Opinion Poll : కాంగ్రెస్ కు 11 సీట్లు.. బీఆర్ఎస్ కు భారీ షాక్: ఎంపీ ఎన్నికలపై సంచలన సర్వే బుక్ మై షో నిర్వహిస్తున్న సన్ బర్న్ ఈవెంట్‌పై కూడా పోలీసులు నిఘా పెట్టి అసలు విషయం తేల్చాలని సూచించారు. కొన్ని అంశాలను కేవలం ఆదాయ మార్గంగానే చూడలేమని పేర్కొన్నారు. అలాంటి ఈవెంట్లను కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే నిషేధించాయని గుర్తుచేశారు. #cm-revanth-reddy #cm-revanth-reddy-review మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి