ఇండస్ట్రియల్ కారిడార్ల కోసం భూములు గుర్తించండి.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటుకు ఔటర్ రింగ్ రోడ్ కు బయట, రీజినల్ రింగ్ రోడ్ కు లోపల 500 నుండి 1000 ఎకరాల భూములను గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. విమానాశ్రయాలకు, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులకు 50 నుంచి 100 కిలోమీటర్ల లోపే దూరం ఉండాలని సూచించారు.