Telangana: ఢిల్లీలో తెలంగాణ భవన్.. అధికారులతో సీఎం కీలక సమీక్ష..

దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ భవన్‌ను నిర్మించేందుకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ భవన్‌ను నిర్మించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం. అలాగే, ఉమ్మడి ఆస్తుల విభజనపై ఫోకస్ పెట్టాలని ఆదేశించారు.

New Update
Telangana: ఢిల్లీలో తెలంగాణ భవన్.. అధికారులతో సీఎం కీలక సమీక్ష..

Telangana Bhavan: దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వం.. తెలంగాణ భవన్ నిర్మించేందుకు సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా తెలంగాణ భవన్‌ను నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ మేరకు ఢిల్లీలో ఇవాళ అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్. న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్, ఆంధ్రప్రదేశ్ భవన్ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. న్యూ ఢిల్లీలోని తన నివాసంలో ఈ అంశంపై తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, భవన్ ఓఎస్డీ సంజయ్ జాజుతో సమీక్ష నిర్వహించిన ఆయన.. భవన్ మొత్తం విస్తీర్ణం ఎంత? అందులో ఉన్న భవనాలు, వాటి స్థితి, అందులో తెలంగాణ వాటా ఎంత వంటి వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ఆస్తిగా 19.781 ఎకరాల భూమి ఉందని అధికారులు తెలిపారు. ఇందులో ఉమ్మడి భవన్ పరిధిలోని 8.781 ఎకరాల్లో శబరి బ్లాక్, అంతర్గత రోడ్లు, గోదావరి బ్లాక్, 3.359 ఎకరాల్లో ఓల్డ్ నర్సింగ్ హాస్టల్, 7.641 ఎకరాల్లో పటౌడి హౌస్ ఉన్నాయని అధికారులు వివరించారు. తెలంగాణ వాటా కింద ఎంత భూమి వస్తుందని సీఎం ప్రశ్నించారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం మన రాష్ట్రం తెలంగాణకు 8.245 ఎకరాల భూమి వస్తుందని, ఏపీకి 11.536 ఎకరాలు (41.68:58.32 నిష్పత్తిలో) వెళుతుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.


కాగా, ప్రస్తుతం ఉన్న భవనాల స్థితి, అధికారులు, సిబ్బంది నివాస గృహాల స్థితిపై సీఎం ఆరా తీశారు. ఈ భవనాలు దాదాపు 4 దశాబ్దాల క్రితం నిర్మించినవి కావడంతో చాలా వరకు శిథిలావస్థకు చేరాయని, మరమ్మతులు చేయిస్తున్నామని రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా నూతన భవనం నిర్మించాలని ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దానికంటే ముందుగా రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఆస్తుల విభజనపై దృష్టి సారించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుతం భవన్ మ్యాప్ ను పరిశీలించారు. ఆస్తుల విభజనపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.


సీఎం రేవంత్ రెడ్డి విందు..

ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి విందు ఇచ్చారు. సీఎం కావడం, ఎంపీగా రాజీనామా చేయడంతో.. ఢిల్లీలో విందు ఇచ్చారు రేవంత్‌రెడ్డి. సీఎం రేవంత్‌ ఇచ్చిన విందుకు హాజరైన ఆయా పార్టీల ఎంపీలు హాజరయ్యారు. వైసీపీ ఎంపీలు బాలశౌరి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు నిరంజన్‌రెడ్డి హాజరయ్యారు. బీజేపీ నుంచి సీఎం రమేష్‌ హాజరవగా.. కాంగ్రెస్‌ నుంచి కార్తీ చిదంబరం, శశిథరూర్, టీఎంసీ నుంచి సౌగత్‌రాయ్‌ హాజరయ్యారు.


Also Read:

హైదరాబాదీలకు బిగ్ షాక్.. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు..

Advertisment
తాజా కథనాలు