Praja Darbar: ప్రజాదర్బార్‌కు ప్రజల క్యూ.. వివిధ జిల్లాల నుంచి భారీ వచ్చిన జనం! ప్రజాదర్బార్‌కు ప్రజల క్యూ కట్టారు. సమస్యలు చెప్పుకునేందుకు జిల్లాల నుంచి జనం తరలివచ్చారు. ఒక్కొకరి సమస్యలను విన్న సీఎం రేవంత్.. వచ్చిన ఫిర్యాదులను జిల్లా కలెక్టర్లకు, సంబంధిత శాఖ అధికారులకు సిఫార్సు చేశారు. By Trinath 08 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణ(Telangana) సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతి రోజు నుంచే రేవంత్‌రెడ్డి(Revanth reddy) తన మార్క్ రూలింగ్‌ను స్టార్ట్ చేశారు. ప్రగతిభవన్ కంచెలను కూల్చేసి ప్రజలను లోపలకి అనుమతిస్తామన్న మాటను నిలబెట్టుకున్న రేవంత్.. ప్రజల సమస్యలను నేరుగా వింటున్నారు. ప్రగతిభవన్ పేరును ప్రజాభవన్‌గా మార్చి.. అందులో ప్రజా దర్బార్‌ని నిర్వహించిన రేవంత్‌కు సమస్యలు చెప్పుకునేందుకు సామాన్యులు పోటెత్తారు. ప్రజాభవన్ వద్ద భారీ క్యూ లైన్లు కనిపించాయి. జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో ప్రజా దర్బార్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వివిధ జిల్లాల నుంచి భారీ వచ్చిన జనం: ప్రజాదర్బార్‌కు నేతలు క్యూ కట్టారు. కొండపోచమ్మ ముంపు బాధితులు సీఎంను కలిశారు. ఇప్పటివరకు నష్టపరిహారం అందలేదని సీఎంకు వివరించారు బాధితులు. ఇక ప్రజాదర్బార్‌కి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. వచ్చిన ప్రతీ ఫిర్యాదును పరిశీలించేందుకు 20మంది సిబ్బంది ఉన్నారు. ఈ ఫిర్యాదులను జిల్లా కలెక్టర్లకు, సంబంధిత శాఖ అధికారులకు సిఫార్సు చేస్తున్నారు సీఎం. ప్రతీనెల వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్షిస్తున్నారు. ఒక్కొకరి సమస్యలను సీఎం వింటున్నారు. సమస్యలు చెప్పుకునేందుకు వివిధ జిల్లాల నుంచి జనవం వస్తుండడం విశేషం. రేవంత్‌ను NSUI రాష్ట్ర నాయకులు కలిశారు. జెన్‌కో ఏఈ నియామక పరీక్ష వాయిదా వేయాలని కోరారు. గతంలోనూ ఇంతే: అటు ప్రజలకు ఎలాంటి కన్ఫూజన్ లేకుండా అధికారులు హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. ప్రజలు తమ ఫిర్యాదులను అక్కడ నమోదు చేసుకోవచ్చు. దరఖాస్తులను సమర్పించాలి. ఆ తర్వాత తదుపరి చర్యల కోసం అధికారులు వారిని లోపలికి పంపుతారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రులు ఉదయం పూట నేరుగా ప్రజలను కలుస్తుండేవారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇది విజయవంతంగా నడిచింది.ఇప్పుడు రేవంత్ కూడా అదే ఫాలో అవుతున్నారు. అపాయింట్ మెంట్ లేకుండానే ఎవరైనా నేరుగా ప్రజా భవన్ కు వచ్చి తమ సమస్యలను పేపర్ మీద రాసి ఇవ్వచ్చునని…ప్రజలకు అన్ని హక్కులు ఉన్నాయని రేవంత్ తెలిపారు. Also Read: నాసిరకం పిచ్‌లు.. పరువు తీసిన బీసీసీఐ.. ఐసీసీ షాకింగ్ రిపోర్ట్! #revanth-reddy #telangana-politics #praja-darbar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి