TSPSC: ఆందోళన వద్దు.. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి తీరుతాం.. సీఎం రేవంత్ రెడ్డి భరోసా

టీఎస్పీఎస్సీ పరీక్షలపై సీఎం రేవంత్‌ రెడ్డి కీలక ప్రకటన చేశారు. 2 లక్షల ప్రభుత్వోద్యోగాలను యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తామని స్పష్టంచేశారు. కమిషన్ కు కొత్త చైర్మన్‌, సభ్యుల నియామకం జరగగానే నియామకాల ప్రక్రియను అత్యంత వేగంగా, పారదర్శకంగా చేపడతామని భరోసా ఇచ్చారు.

New Update
TSPSC పేరు మార్చనున్న రేవంత్ సర్కార్.. కొత్త పేరు ఇదే?

TSPSC Exams: టీఎస్పీఎస్సీ పరీక్షలపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ప్రభుత్వోద్యోగాలను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేస్తామని స్పష్టంచేశారు. టీఎస్పీఎస్సీకి (TSPSC) కొత్త చైర్మన్‌, సభ్యుల నియామకం జరగగానే నియామకాల ప్రక్రియను అత్యంత వేగంగా, పారదర్శకంగా చేపడతామని భరోసా ఇచ్చారు. 2024 డిసెంబరు 9లోగా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. తెలంగాణ నిరుద్యోగ యువత ఆందోళన చెందవద్దని కోరారు.

చైర్మన్‌, సభ్యుల రాజీనామాను గవర్నర్‌ ఆమోదించిన వెంటనే పారదర్శకంగా కొత్త బోర్డును నియమిస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ (Congress Job Calender) ప్రకారం నియామకాలు జరుగుతాయని, యువత ఆందోళన చెందవద్దని కోరారు. గత ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ఉద్యోగ నియామకాలను తీవ్ర నిర్లక్ష్యం చేసిందని, తమ ప్రభుత్వంలో పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు విడుదల చేసిన నోటిఫికేషన్ల ఉద్యోగాలను కూడా గత ప్రభుత్వ హయాంలో భర్తీ చేయలేకోపోయారని పేపర్ లీక్స్ వంటి అవకతవకలతో నిరుద్యోగ యువతను తీవ్ర మానసిక క్షోభకు గురిచేశారని విమర్శించారు. తమ ప్రభుత్వంలో అవినీతికి తావు లేకుండా నియామక ప్రక్రియ సాగుతుందన్నారు. ఎన్నికల హామీని ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకుంటామన్నారు.

ఇది కూడా చదవండి: TSPSC: టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ గా ఆ మాజీ ఐఏఎస్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం? 

Advertisment
తాజా కథనాలు