Revanth Reddy On New Jobs : తెలంగాణ(Telangana) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఉద్యోగాలపై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి TSPSCతో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు(Government Jobs) సంబంధించిన బోర్డులు, నోటిఫికేషన్లపై రేవంత్ అనేకసార్లు ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన సింగరేణి ఉద్యోగ మేళా(Singareni Job Mela) లో రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పుకొచ్చారు.
నలుగురికి పోతే 400మందికి వచ్చాయ్:
సింగరేణి ఉద్యోగుల నియామక సభలో పాల్గొన్న రేవంత్ 441 మందికి నియామక పత్రాలను అందించారు. ఇదే సభా వేదికగా నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్ చెప్పారు. త్వరలోనే 15 వేల పోలీస్ ఉద్యోగాల నియామకానికి జీవో విడుదల చేస్తామని తెలిపారు. ఒక నలుగురి ఉద్యోగాలు ఊడగొడితే 441 మందికి జాబ్ వచ్చిందన్నారు రేవంత్.
గ్రూప్-1 పోస్టుల పెంపు:
పరిపాలనా యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం 60 అదనపు గ్రూప్-1(Group-1) పోస్టుల నియామకాన్ని ప్రకటించింది. గతంలో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 503 పోస్టులకు ఎగ్జామ్ జరగాల్సి ఉంది. అయితే తాజాగా రేవంత్ నిర్ణయంతో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) ద్వారా భర్తీ చేయాల్సిన మొత్తం గ్రూప్-I స్థానాల సంఖ్య 563కి చేరుకుంది. 60 కొత్త పోస్టులు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ లాంటి పోస్టులున్నాయి. డిసెంబరు 2024 నాటికి తెలంగాణలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలన్న ప్రభుత్వ నిబద్ధతలో భాగంగా గ్రూప్-1 పోస్టుల సంఖ్యను పెంచినట్టుగా అర్థమవుతోంది.
Also Read : కనీసం పంట నష్ట పరిహారం కూడా ఇవ్వలేని దిక్కుమాలిన ప్రభుత్వం: షర్మిల!
WATCH: