Revanth Reddy New Year: రైతులు, విద్యార్థులకు రేవంత్‌ గుడ్‌న్యూస్‌.. న్యూఇయర్‌ మెసేజ్‌లో ఏం అన్నారంటే?

తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు రేవంత్‌రెడ్డి. ఈ కొత్త సంవత్సరం ‘రైతు - మహిళ - యువత నామ సంవత్సరం’ గా సంకల్పం తీసుకున్నామన్నారు. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు సమూల ప్రక్షాళనకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

Revanth Reddy New Year: రైతులు, విద్యార్థులకు రేవంత్‌ గుడ్‌న్యూస్‌.. న్యూఇయర్‌ మెసేజ్‌లో ఏం అన్నారంటే?
New Update

నూతన సంవత్సరం(New Year) సందర్భంగా తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రజలకు మెసేజ్ ఇచ్చారు. తెలంగాణ(Telangana) ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. మీ అందరి సహకారంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. నిర్భందాలు, ఇనుప కంచెలను తొలగించామని చెప్పుకొచ్చారు. పాలనలో ప్రజలను భాగస్వాములను చేశామని.. ప్రజాస్వామ్య పునరుద్ధరణ, పౌరులకు స్వేచ్ఛ ఉంటుందన్న హామీని నిలబెట్టుకున్నామని తెలిపారు.

రేవంత్‌ ఇంకేం అన్నారంటే?

➼ ఆరింటిలో రెండు గ్యారెంటీలు అమలు చేశాం.

➼ కొత్త ఏడాదిలో మిగతా గ్యారెంటీల అమలుకు సిద్ధంగా ఉన్నాం.

➼ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందాలి.

➼ అభివృద్ధిలో రాష్ట్రం అగ్రభాగాన ఉండాలి అన్నది మన ప్రభుత్వ ఆకాంక్ష.

➼ యువత భవిత మాకు ప్రాధాన్యం. వారి భవిష్యత్ కు గ్యారెంటీ ఇచ్చే దిశగా ఆలోచిస్తున్నాం.

➼ ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు సమూల ప్రక్షాళనకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

➼ రైతుల విషయంలో ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నాం.

➼ ఈ నూతన సంవత్సరం ‘రైతు - మహిళ - యువత నామ సంవత్సరం’ గా సంకల్పం తీసుకున్నాం.

➼ ప్రజా పాలనకు అనుగుణంగా వ్యవస్థల పునర్ వ్యవస్థీకరణ జరుగుతోంది.

➼ చిన్నాభిన్నమైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిపుష్ఠం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం.

➼ ఆర్థిక, విద్యుత్ రంగాలలో వాస్తవ పరిస్థితులను శ్వేతపత్రాల ద్వారా మీ ముందు ఉంచాం.

➼ తర్వలో సాగునీటి రంగంలో జరిగిన అవినీతి పై కూడా శ్వేతపత్రంతో వాస్తవాలు వెల్లడిస్తాం.

➼ గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకుంటామని, దోపిడీకి గురైన తెలంగాణ ప్రజల సంపదను తిరిగి రాబడతామని మాట ఇచ్చాం.

➼ ఆ దిశగా చర్యలు మొదలు పెట్టాం.

➼ అధికారం కోల్పోయిన దుగ్ధ, ఈర్ష్యతో కొందరు అధములు చేసే తప్పుడు ప్రచారాలు, అసత్య ప్రకటనలతో గందరగోళపడవద్దు.

➼ ఇది గత పాలన కాదు... జన పాలన.

➼ ప్రతి పౌరుడు ఈ ప్రభుత్వాన్ని చేరుకునేందుకు 24 గంటలు ద్వారాలు తెరిచే ఉంటాయి.

➼ అమరులు, ఉద్యమకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.

➼ తెలంగాణ ఉద్యమకారులపై నమోదైన కేసుల వివరాలు సేకరిస్తున్నాం.

➼ ఆ కేసుల నుంచి విముక్తి కల్పించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది.

➼ ఆటో కార్మికులు, అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం రూ.5 లక్షల బీమా సౌకర్యాన్ని తీసుకొచ్చాం.

➼ జర్నలిస్టుల సంక్షేమం పట్ల మన ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది.

➼ తెలంగాణ కోటి రతనాల వీణగా... కోట్లాది ప్రజల సంక్షేమ వాణిగా... అభివృద్ధిలో శిఖరాగ్రాన నిలవాలని ఆకాంక్షిస్తున్నా..

ఈ నూతన సంవత్సరంలో ప్రతి పౌరుడి ఆకాంక్షలు నెరవేరాలని.. తెలంగాణలోని ప్రతి గడపన సౌభాగ్యం వెల్లివిరియాలని, ప్రతి ఇంటా వెలుగులు నిండాలని మనసారా ఆకాంక్షిస్తున్నా...!

Also Read: పొడవాటి జుట్టు, క్లీన్ షేవ్.. యాక్టింగ్‌ స్కూల్‌లో రాంచరణ్‌ని ఎలా నటించాడో చూడండి!

WATCH:

#revanth-reddy #happy-new-year-2024
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe