Hydra: హైడ్రాపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. మూడు జోన్లుగా! TG: హైడ్రాపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధి వరకు ఉన్న హైడ్రాను హెచ్‌ఎండీఏ వరకు విస్తరించేందుకు సిద్ధమైంది. మొత్తంగా వ్యవస్థను మూడు జోన్లుగా విభజించి, వాటి బాధ్యతలను ఎస్పీ స్థాయి అధికారులకు అప్పగించనుంది. By V.J Reddy 07 Sep 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Hydra: అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా మరింత బలోపేతం అయ్యేందుకు సిద్ధమైంది. పైలట్ ప్రాజెక్ట్ కింద కేవలం హైదరాబాద్ వరకు పరిమితం అయిన హైడ్రాను ఇప్పుడు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) వరకు విస్తరించేందుకు రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మొత్తం మూడు జోన్లుగా విభజించి, వాటి బాధ్యతలను ఎస్పీ స్థాయి అధికారులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా సెంట్రల్ జోన్‌గా హైదరాబాద్ పోలీసు కమిషనరేట్, నార్త్ జోన్‌గా సైబరాబాద్, సౌత్ జోన్‌గా రాచకొండను విభజించేందుకు సన్నాహాలు చేస్తోంది. వీటికి జోనల్ అధికారులు, పూర్తిస్థాయి సిబ్బందిని నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ మొదలు పెట్టింది. ఈ మూడు జోన్లను చీఫ్ కమిషనర్ పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం రెండు నెలల కిందట ప్రత్యేక జీవో ద్వారా ఏర్పాటైన హైడ్రాకు చట్టబద్ధత కల్పించేందుకు న్యాయశాఖ అధ్యయనం చేస్తోంది. కాగా దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్టు సమాచారం. #hydra మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి