Ts news: రుణమాఫీ వారికి మాత్రమే.. సీఎం రేవంత్‌రెడ్డి సంచలన ప్రకటన

తెలంగాణలో రైతుల రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఒక్కో కుటుంబానికి గరిష్టంగా రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాత్రమే మాఫీ అవుతాయని తెలిపారు. రుణమాఫీ తర్వాత పెన్షన్లు రూ.4వేలకు పెంపుపై దృష్టి పెడతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.

Ts news: రుణమాఫీ వారికి మాత్రమే.. సీఎం రేవంత్‌రెడ్డి సంచలన ప్రకటన
New Update

Hyderabad: తెలంగాణలో రైతుల రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. 3, 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని వెల్లడించారు. ఒక్కో కుటుంబానికి గరిష్టంగా రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాత్రమే మాఫీ అవుతాయని తెలిపారు. బంగారం తాకట్టు రుణాలు దీని పరిధిలోకి రావని స్పష్టం చేశారు. రుణమాఫీకి రేషన్‌ కార్డ్‌ ప్రామాణికం కాదని క్లారిటీ ఇచ్చారు. కేవలం కుటుంబాన్ని గుర్తించడం కోసమే రేషన్‌ కార్డ్‌ ఉందన్నారు. పట్టాదారు పాస్‌ పుస్తకాల ఆధారంగానే పంట రుణాల లెక్కింపు ఉంటుందన్నారు. అయితే.. రూ.50 వేల నుంచి లక్ష వరకు తీసుకున్న రుణాలే ఎక్కువ ఉన్నాయి. అవి రూ.6 నుంచి 7 వేల కోట్లు ఉండొచ్చని అంచనా వేశారు. రుణమాఫీ తర్వాత పెన్షన్లు రూ.4 వేలకు పెంపుపై దృష్టి పెడతామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రుణమాఫీకి సంబంధించిన వివరాలను సీఎం ఢిల్లీలో వెల్లడించారు. అయితే ఒక కుటుంబంలో నలుగురు కుటుంబసభ్యులు, రూ. 50వేల చొప్పున తీసుకుంటే అందరికీ వర్తిస్తుందా..? లేదంటే ఒక్కరికి మాత్రమే ఇస్తారా..? అన్న దానిపై ఇంక స్పష్టత లేదు.

ఇది కూడా చదవండి: ఈ డ్రై ఫ్రూట్స్‌తో ఎన్నో లాభాలు.. తప్పక తెలుసుకోండి!

#telangana #farmers-loan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe