CM Revanth Reddy: అలా పని చేస్తేనే 6 గ్యారెంటీల అమలు.. పోలీసులకు ఫుల్ పవర్స్: రేవంత్ రెడ్డి

అధికారులు, ప్రజాప్రతినిధులు జోడెద్దుల్లా పని చేసి ఆరు గ్యారెంటీలను క్షేత్ర స్థాయిలో అమలు చేయాలని సీఎం రేవంద్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. పోలీసులకు ఫుల్ పవర్స్ ఇచ్చామని.. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేశారు.

New Update
CM Revanth Reddy: అలా పని చేస్తేనే 6 గ్యారెంటీల అమలు.. పోలీసులకు ఫుల్ పవర్స్: రేవంత్ రెడ్డి

కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈ రోజు నిర్వహించిన సమావేశం ముగిసింది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపైనే రేవంత్ రెడ్డి ప్రధానంగా అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. హామీలన్నీ అమలు కావాలంటే.. సంక్షేమం పూర్తి స్థాయిలో అసలైన లబ్ధిదారులకు చేరాలంటే ప్రజా ప్రతినిధులు, అధికారులు జోడెద్దుల్లా పని చేయాలని సీఎం సూచించినట్లు తెలుస్తోంది. సచివాలయంలో తీసుకున్న ప్రతీ నిర్ణయాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులదేనని అన్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Parliament Elections : పార్లమెంట్ ఎన్నికలు.. కాంగ్రెస్ అభ్యర్థులు వీరే!

పోలీసులకు ఫుల్ పవర్ ఇచ్చామని.. భూ కబ్జాదారులు, అక్రమార్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలవద్దని సీఎం స్పష్టం చేశారు. ప్రజా పాలన పేరుతో ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించాలని సీఎం ఈ సందర్భంగా సూచించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయకపోతే టార్గెట్ రీచ్ కాలేమని సీఎం అధికారులతో అన్నట్లు తెలుస్తోంది. ప్రజాపాలన పేరుతో ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో సభలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. సీఎం ఆదేశాలతో ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి మ.2 గంటల వరకు, తిరిగి మ.2 నుంచి సా.5 గంటల వరకు సభలు నిర్వహించనున్నారు అధికారులు.

నిస్సహాయులకు ప్రభుత్వం అండగా ఉండి సాయం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పినట్లు సమాచారం. అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదని సీఎం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. చివరి వరసలో ఉన్న పేదవాడికి కూడా సంక్షేమం అందించే బాధ్యత అధికారులదే అని సీఎం రేవంత్‌ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
publive-image

ఇంకా తెలంగాణలో డ్రగ్స్ అనే మాట వినపడవద్దని సీఎం అధికారులకు తేల్చిచెప్పారు. అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించినట్లు సమాచారం. ఇష్టం లేని వారు బాధ్యతలు నుంచి తప్పుకోవాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు