Nampally Exhbition: హైదరాబాద్‌ అంటే గుర్తొచ్చేది ఈ మూడే..చార్మినార్‌...ట్యాంక్‌బండ్‌..నుమాయిష్‌: సీఎం!

నాంపల్లి ఎగ్జిబిషన్ నుమాయిష్‌ ని సీఎం రేవంత్‌ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి వ్యాపారవేత్తలు వస్తూంటారని ఆయన పేర్కొన్నారు.

New Update
Nampally Exhbition: హైదరాబాద్‌ అంటే గుర్తొచ్చేది ఈ మూడే..చార్మినార్‌...ట్యాంక్‌బండ్‌..నుమాయిష్‌: సీఎం!

హైదరాబాద్‌ (Hyderabad)  కే వన్నె తెచ్చిన నాంపల్లి ఎగ్జిబిషన్‌(Namapalli Exbition)  నుమాయిష్‌  (Numaish) సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth reddy)  అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..హైదరాబాద్‌ అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేవి మూడే..అవి చార్మినార్‌..ట్యాంక్‌బండ్‌..నాంపల్లి ఎగ్జిబిషన్‌ నుమాయిష్‌ అని పేర్కొన్నారు.

ఈ ఎగ్జిబిషన్‌ లో కశ్మీర్‌ నుంచి కన్యా కుమారి వరకు వ్యాపారవేత్తలు వచ్చి పాల్గొంటారని సీఎం అన్నారు. ఈ ఎగ్జిబిషన్‌ లో అనేక రకాల కళలకు సంబంధించిన వస్తువులను ప్రదర్శించడం జరుగుతుందని సీఎం అన్నారు. నుమాయిష్‌ కమిటీ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థలకు గవర్నమెంట్‌ కచ్చితంగా తోడ్పాటును ఇస్తుందని వివరించారు.

ఈ ఎగ్జిబిషన్‌ లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం మెచ్చుకోదగిన విషయమని సీఎం అన్నారు. పారిశ్రామిక రంగంలో మహిళలకు ప్రోత్సాహం అందిస్తామని ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ హామీ ఇచ్చారు. కొన్ని సంవత్సరాల నుంచి ఇంజినీర్లు, డాక్టర్లు, వివిధ సంస్థలు కలిసి నుమాయిష్‌ ను విజయవంతంగా..ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు.

నుమాయిష్‌ తెలంగాణకే గర్వకారణమని మంత్రి అన్నారు.తెలంగాణ ప్రజలు మార్పు కోసం కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారని... రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని రంగాల్లో మార్పులు తీసుకు వస్తామన్నారు.

Also read: బైరి నరేష్‌ పై దాడికి దిగిన అయ్యప్ప స్వాములు!

Advertisment