CM Revanth Reddy : రానున్న పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఎంసీహెచ్ఆర్డీ (mchrd) 5 జిల్లాలకు చెందిన నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాలకు చెందిన నాయకులు హాజరయ్యారు. ప్రజాపాలన, పార్లమెంట్ ఎన్నికల(Parliament Elections)కు సంబంధించిన అంశాలపై నేతలో చర్చించారు. రాష్ట్రంలో 17 లోకసభ స్థానాల్లో కనీసం 12 స్థానాలకు తగ్గకుండా గెలిచేందుకు కార్యచరణతో ముందుకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి నాయకులకు సూచించారు. ఈనెల 26 తర్వాత జిల్లాల పర్యటన(District tour after 26th of this month)కు వెళ్లాలని సీఎం నిర్ణయించారు.
కాగా ఈ సమీక్షలో ఆయా ఉమ్మడి జిల్లాల ఇంచార్జీలు పాల్గొన్నారు. ఆదిలాబాద్ ఇంచార్జీగా మంత్రి సీతక్క, నిజామాబాద్ జిల్లా ఇంచార్జీ జూపల్లి, మెదక్ కొండా సురేఖ, మహబూబ్ నగర్ దామోదర రాజనర్సింహా, హైదరాబాద్ పొన్నం ప్రభాకర్ ఇంచార్జీగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ …!!
ఈనెల 26 తర్వాత జిల్లాల పర్యటనకు వెళ్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో సీఎం తొలిసభ నిర్వహించేలా ప్లాన్ రెడీ చేశారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఇంద్రవెల్లి సభలో సీఎం పాల్గొన్నారు. ఈసారి పర్యటనలో ఇంద్రవెల్లి అమరవీరుల స్మారక స్మ్రుతివనం శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. దీంతోపాటు ఇంద్రవెల్లి అమర వీరుల కుటుంబాలను గుర్తించి ఆదుకుంటామని ప్రకటించారు. జనవరి 26 తర్వాత ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.