CM Revanth Reddy: తెలంగాణ ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి ఏకాదశి పండుగ (Tholi Ekadashi) శుభాకాంక్షలు తెలియజేశారు. ఆషాడ మాసంలో పవిత్రమైన తొలి ఏకాదశిని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు, సకల శుభాలు కలిగించాలని ప్రార్థించారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రూపాయల రైతుల రుణమాఫీకి (Rythu Runa Mafi) ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతు కుటుంబాలన్నీ రుణ విముక్తి పొందాలని, ఏకాదశి పండుగను ప్రతి ఇంటా ఆనందంగా జరుపుకోవాలని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
రేపటి నుంచి రుణమాఫీ షురూ..
తెలంగాణలో రేపటినుంచే రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం కానుంది. రేపు లక్ష రూపాయల లోపు రుణమాఫీ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు రైతు ఖాతాల్లో జమ చేయనుంది. 11లక్షల 50 వేల మంది రైతులకు రేపు ఒకేసారి రుణమాఫీ కానుంది. తొలి రోజు రూ.6 వేల 800 కోట్ల నగదు రైతుల ఖాతాల్లో జమ చేయనుంది రేవంత్ సర్కార్. రెండో దఫా ఆగస్ట్ 15 లోపు మరో లక్ష బ్యాంకుల్లో జమ చేసేందుకు సిద్ధమైంది.