CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు మరోసారి షాక్

లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్‌ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా వేసింది. కాగా ఈ నెల 19తో కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ ముగుస్తోంది.

CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు మరోసారి షాక్
New Update

CM Kejriwal Bail: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో తనకు బెయిల్ కావాలంటూ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. వీడియో కాల్ ద్వారా తన భార్య సమక్షంలో తనకు మెడికల్ పరీక్షలు నిర్వహించేందుకు అనుమఠీ ఇవ్వాలని న్యాయమూర్తిని కేజ్రీవాల్ తరఫున లాయర్లు కోరారు. కాగా కేజ్రీవాల్ కోరిన దానిపై సమాధానం ఇవ్వాలని తీహార్ జైలు అధికారులను కోరింది. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై విచారణను మరోసారి వాయిదా వేసింది. ఈ నెల 19కి తదుపరి విచారణ చేపడుతామని తెలిపింది. కాగా జులై 19న కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ ముగియనుంది.

ఎన్నికల అనంతరం లొంగిపోయారు...

లోక్ సభ ఎన్నికల అనంతరం తీహార్ జైల్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లొంగిపోయారు. ఇటీవల లోక్ సభ ఎన్నికలకు (Lok Sabha Elections) ప్రచారం చేసుకునేందుకు సుప్రీం కోర్టు కేజ్రీవాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. జూన్ 2తో మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో తిరిగి జైలుకు వెళ్లారు. కాగా అనారోగ్యం కారణంగా తనను ఇచ్చిన మధ్యంతర బెయిల్ ను వారం రోజుల పాటు పొడిగించాలని సుప్రీం కోర్టులో సీఎం కేజ్రీవాల్ పిటిషన్ వేయగా.. ఆ పిటిషన్ సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. 

#cm-kejriwal
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe