CM Kejriwal: కేజ్రీవాల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌

లాయర్లతో సమావేశాల సంఖ్య పెంచాలని కోరుతూ సీఎం కేజ్రీవాల్‌ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారంలో ఐదుసార్లు లాయర్లతో భేటీ అయ్యేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. కేజ్రీవాల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసిన ఢిల్లీ కోర్టు.. ఏప్రిల్ 9న తీర్పు వెలువరించనుంది.

CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు బెయిలా? జైలా?
New Update

CM Kejriwal: లాయర్లతో సమావేశాల సంఖ్య పెంచాలని కోరుతూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారంలో ఐదుసార్లు లాయర్లతో భేటీ అయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కేజ్రీవాల్‌ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈరోజు ఈ పిటిషన్ ను విచారించిన ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది. కేజ్రీవాల్ పిటిషన్‌పై ఢిల్లీ కోర్టు ఏప్రిల్ 9న తీర్పు వెలువరించనుంది.

కేజ్రీవాల్ కు ఊరట దక్కేనా?

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తన అరెస్ట్, ఈడీ కస్టడీని సవాల్ చేస్తూ సీఎం కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను విచారించిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. అయితే.. ఈ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ లభిస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది. లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్ ను ఈడీ మార్చి 21న అరెస్ట్ చేసింది. మొదటగా కేజ్రీవాల్ కు ఆరు రోజుల ఈడీ కస్టడీ విధించింది.. ఆ తరువాత మరో నాలుగు రోజులు ఈడీ కస్టడీని పొడిగించింది. ఈ నెల 1వ తేదీన ఈడీ.. కేజ్రీవాల్ కస్టడీ పొడిగించాలని తద్వారా మద్యం కుంభకోణం కేసులో అనేక విషయాలు బయటకు వస్తాయని కోర్టుకు విన్నపించుకోగా..  ఏప్రిల్ 15వ తేదీ వరకు కేజ్రీవాల్ ఈడీ కస్టడీ పొడిగించింది. ఈ కేసులో తనకు ఊరట లభిస్తుందని అనుకున్న కేజ్రీవాల్ దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. 

కవితకు సీబీఐ షాక్..

లిక్కర్ స్కాం కేసులో బెయిల్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఎమ్మెల్సీ కవితకు ఊహించని షాక్ ఇచ్చింది సీబీఐ. మద్యం స్కాం కేసులో కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సీబీఐ. అయితే… సీబీఐ వేసిన పిటిషన్ ను అంగీకరించిన కోర్టు.. కవితను విచారించేందుకు సీబీఐకి అనుమతి ఇచ్చింది. వచ్చే వారంలో తీహార్ జైలులో మహిళా కానిస్టేబుల్ సమక్షంలో ఎమ్మెల్సీ కవితను సీబీఐ విచారించనుంది. కవిత ఇచ్చే వాంగ్మూలాన్నిసీబీఐ నమోదు చేసుకోనుంది. జైలులోకి ల్యాప్ టాప్, స్టేషనరీ తీసుకెళ్లేందుకు సీబీఐకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. విచారణకు ఒక రోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని సీబీఐ కి  కోర్టు ఆదేశాలు ఇచ్చింది. 

#cm-kejriwal #aap-in-delhi-liquor-scam
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe