కొమురం భీం కలలను కేసీఆర్ సాకారం చేశారు

మంత్రి కేటీఆర్‌ నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఉద్యమ నినాదాలనే కాదు.. జల్, జంగల్, జమీన్ అనే కుమ్రం భీం కలలను కూడా అక్షరాలా సాకారం చేసిన ధీరోదాత్తమైన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

New Update
కొమురం భీం కలలను కేసీఆర్ సాకారం చేశారు

CM KCR who made the dreams of Kumram Bheem come true

నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఉద్యమ నినాదాలనే కాదు.. జల్, జంగల్, జమీన్ అనే కుమ్రం భీం కలలను కూడా అక్షరాలా సాకారం చేసిన ధీరోదాత్తమైన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మొన్న కొండకోనల్లోని నివాసాలకు మిషన్ భగీరథతో స్వచ్ఛమైన జల్, నిన్న కంటికి రెప్పలా కాపాడటంతో.. రాష్ట్రంలో 7.70 శాతం జంగల్ పెరిగిందని, నేడు 1.51 లక్షల మందికి ఏకంగా 4.60 లక్షల ఎకరాల జమీన్ భూములు పంచుతున్నారని చెప్పారు.

గిరిజన బిడ్డల్లో ఆత్మ విశ్వాసం

గ్రామ పంచాయితీల ఏర్పాటుతో మావ నాటే–మావరాజ్ స్వప్నం సాకారమైందని వెల్లడించారు. పది శాతానికి పెరిగిన రిజర్వేషన్లతో గిరిజన బిడ్డల్లో ఆత్మ విశ్వాసం పెరిగిందన్నారు. ఇలా ఒకటా.. రెండా.. పోడు భూముల గోడు తీర్చి.. గిరిజన-ఆదివాసీల ఆశలన్నీ నెరవేర్చి, పట్టాలతో పట్టాభిషేకం చేస్తున్న తరుణమిదని మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు.

మూడోస్థానంలో తెలంగాణ 

జల్‌, జంగల్‌, జమీన్‌ అని నినదించిన గోండు వీరుడు కుమ్రంభీం పుట్టిన గడ్డ నుంచే సీఎం కేసీఆర్‌ పోడు భూముల పట్టాల పంపిణీని ప్రారంభించనున్నారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న గిరిజనుల పోడుకల నేటితో నెరవేరనున్నది. దేశచరిత్రలో మొట్టమొదటిసారిగా నాలుగు లక్షల పైచిలుకు ఎకరాల భూమికి అడవి పుత్రులను హక్కుదారులను చేయనున్నారు. పోడు పంపిణీలో మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ తర్వాత తెలంగాణ మూడోస్థానంలో సగర్వంగా నిలువబోతున్నది. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ఫారెస్ట్‌ రైట్స్‌ కమిటీలు ఇప్పటికే లబ్ధిదారులను గుర్తించాయి. 28 జిల్లాలు, 295 మండలాలు, 2845 గ్రామ పంచాయతీల పరిధిలో ఫారెస్ట్‌ రైట్స్‌ కమిటీలు క్షేత్రస్థాయిలో పరిశీలించాయి. 12 లక్షల 49 వేల 296 ఎకరాలకు సంబంధించి 4 లక్షల 14 వేల 353 క్లెయిమ్స్‌ను వివిధ స్థాయిలో పరిశీలించి, 28 జిల్లాల పరిధిలో 4 లక్షల 06 వేల 369 ఎకరాల భూమిపై 1 లక్ష 51 వేల 146 మంది లబ్ధిదారులు పోడు పట్టాలు పొందేందుకు అర్హులుగా గుర్తించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు