అర్బన్‌ ఫారెస్టు పార్కులో మొక్క నాటిన కేసీఆర్

తెలంగాణ హరిత స్ఫూర్తి ప్రదాత, నేడు రంగారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటన. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్.

New Update
అర్బన్‌ ఫారెస్టు పార్కులో మొక్క నాటిన కేసీఆర్

CM KCR planted saplings in Urban Forest Park

రాష్ట్ర దశాబ్ది వేడుకల్లో భాగంగా నేడు హరితోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేటి హరితోత్సవం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. అయితే.. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ రంగారెడ్డి జిల్లాలో నేడు పర్యటించారు. ఈ క్రమంలోనే తుమ్మలూరు అర్బన్‌ పార్కులో సీఎం కేసీఆర్‌ మొక్కలను నాటరు. ఏకకాలంలో 25వేల మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేశారు అధికారులు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రసంగిచారు. సీఎం పర్యటన సందర్భంగా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పోలీస్‌ శాఖ పటిష్ట బందోబస్తు చర్యలను చేపట్టింది. మరోవైపు సీఎం కేసీఆర్‌ పర్యటన సందర్భంగా.. రహదారులు, కూడళ్ల వద్ద భారీ కటౌట్లు, హోర్డింగ్స్‌ ఏర్పాటు చేశారు. పార్టీ జెండాలు, తోరణాలు, ఆర్చీలతో తుమ్మలూరు ప్రాంతం గులాబీమయమైంది.

25 వేల మొక్కలు నాటేలా ఏర్పాట్లు

ఇదిలా ఉంటే.. ఈ కార్యక్రమం ఏర్పాట్లను నిన్న సీఎం కార్యదర్శి భూపాల్ రెడ్డి, సీఎం ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్, కలెక్టర్ హరీష్, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీపీ సత్యనారాయణ పర్యవేక్షించారు. కాగా, 25 ఎకరాల విస్తీర్ణంలో 25 వేల మొక్కలను నాటేందుకు అటవీ శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మొత్తం 40 రకాల మొక్కలను ఇప్పటికే అందుబాటులో ఉంచామని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు.

గులాబీమయంతో తుమ్మలూరు ప్రాంతం

తెలంగాణ హరితస్ఫూర్తి ప్రదాత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు, ఉదయం 8:30 గంటలకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని తుమ్మలూరు గ్రామ సరిహద్దులోని మ్యాక్‌ ప్రాజెక్టు వద్ద ఉన్న ఫారెస్టు పార్కులో మొక్కలను నాటరు. అక్కడ ఏకకాలంలో 25వేల మొక్కలు నాటేలా అధికారులు ఏర్పాటు చేశారు. అనంతరం పక్కనే ఉన్న గ్రౌండ్‌లో నిర్వహించే బహిరంగ సభకు సీఎం హాజరుకానున్నారు. పార్టీ జెండాలు, తోరణాలు, ఆర్చీలతో తుమ్మలూరు ప్రాంతం గులాబీమయమైంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు