Telangana Election: ఓటు వజ్రాయుధం..మన తల రాతను మార్చేది అదే: కేసీఆర్

బీఆర్ఎస్‌ ప్రభుత్వం ఎన్నికల ప్రచారం, బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం కేసీఆర్‌ ఎన్నికల పర్యటనలో భాగంగా కోరుట్లలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని సీఎం ప్రసంగించారు.

Telangana Election: ఓటు వజ్రాయుధం..మన తల రాతను మార్చేది అదే: కేసీఆర్
New Update

Telangana Election: కోరుట్లలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లడుతూ.. ఎన్నికలొస్తే ప్రతిసారి గందరగోళం ఉంటుందన్నారు. ఇంకా మనలో డెమోక్రటిక్ మెచ్యూరిటీ ఇంకా రావాల్సి ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఓటు మనకు వజ్రాయుధం లాంటిది. అదే మన తలరాతను మారుస్తుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఎవరేం చేసారన్నది ఆలోచించి ఓటు వేస్తే మంచిదని సీఎం సూచించారు. ఎన్నికలు వస్తాయి.. పోతాయి.. అభ్యర్థి గుణగణాలతో పాటు.. పార్టీ ఎలాంటిదో కూడా చూడాలని ప్రజలను సీఎం కోరారు. గెలిచిన ఎమ్మెల్యేల ద్వారానే ప్రభుత్వం ఏర్పడుతుందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. మీరు కిందా మీద చేస్తే.. తప్పుడు ప్రభుత్వాలు అధికారంలోకి వస్తాయని కేసీఆర్‌ అన్నారు. ఆ పార్టీల నడవడిక, చరిత్ర తెలుసుకోవాలి. ప్రజల కోసం, రైతుల కోసం ఆయా పార్టీలు ఏం చేశాయో ఆలోచించాలని ప్రజలకు సూచించారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరిగిందో

గుడ్డిగా ఓటు వేస్తే చాలా ప్రమాదాలొస్తాయి. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం. ఉద్యమ సమయంలో ఇక్కడికి చాలా సార్లు వచ్చానని కేసీఆర్‌ చెప్పారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం జరిగింది.. గత 50 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం చేసిందో తేడా గమనించాలని అన్నారు. రాష్ట్రం వచ్చినప్పుడు కరెంట్‌, తాగునీరు, సాగునీరు లేదు. వలసలు ఎక్కువగా ఉండేవని సీఎం గుర్తు చేశారు. సిరిసిల్ల, బూదాన్ పోచంపల్లి, దుబ్బాకలాంటి చోట్ల అనేక మంది నేత కార్మికులు చనిపోయేవారు. ఆ శవాలను పట్టుకుని ఏడ్చినా.. అప్పటి సర్కార్‌కు దండం పెట్టినా రూ.50 వేలు సాయం చేయమంటే చేయలేదని కాంగ్రెస్‌ పార్టీని విమర్శించారు. మా సర్కార్‌ వచ్చాక ఆలోచించి పేదల సంక్షేమానికి అనేక పథకాలు తెచ్చామని సీఎం చెప్పారు. గత ప్రభుత్వాలు తమాషా కోసం 40, 70, 200 పెన్షన్ ఇస్తే వేల రూపాయలకు పెన్షన్లు బీఆర్ఎస్ సర్కార్‌ పెంచింది అన్నారు.

రేషన్ కార్డులపై సన్నబియ్యం

నేను కేంద్రంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు ఏ రాష్ట్రంలోనూ బీడీ కార్మికులకు పెన్షన్లు ఇవ్వడం లేదన్నారు. దుబ్బాకలో బీడీ కార్మికులు, నేత కార్మికుల కష్టాలు దగ్గర నుంచి చూశాను కాబట్టే ఎవరూ అడగకుండానే బీడీ కార్మికులకు పెన్షన్ అమలు చేసామని కేసీఆర్‌ తెలిపారు.  పెన్షన్లు ఐదు వేలకు పెంచుతామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. బీడీ కార్మికులు ప్రతిచోట ఎమ్మెల్యేలను పెన్షన్లు అడుగుతున్నారు. కోరుట్లలోనూ కొత్తగా నమోదయ్యే బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తామని సీఎం తెలిపారు. పేదలకు రేషన్ కార్డులపై సన్నబియ్యం ఇస్తామన్నారు. మీకు 24 గంటల కరెంట్ రావాలంటే మళ్లీ బీఆర్ఎస్ రావాలన్నారు. కేసీఆర్ బతికున్నంత వరకు సెక్యులరిజం విషయంలో రాజీ పడేది లేదని సీఎం ధీమా వ్యక్తం చేశారు.  తలసరి ఆదాయంలో, కరెంట్ వినియోగంలోనూ మనమే నెంబర్ వన్‌గా ఉన్నామని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: మురుగు నీటితో పంటల సాగు.. ఎన్టీఆర్ జిల్లాలో సరికొత్త విధానం

#telangana-election-2023 #brs-praja-ashirwada-sabha #korutla #cm-kcr
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe